ఏపీలోని విజయవాడ, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో గత నెల 1 నుంచి 15 వ తేదీల మధ్య తీవ్ర వరద వచ్చిన విషయం తెలిసిందే. విజయవాడలో శివారు ప్రాంతాలైతే.. పది రోజుల పాటు వరద నీటిలోనే నానిపోయాయి.
ఇక, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో పదుల సంఖ్యలో గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. ఆయా ప్రాంతాల్లో నిద్రాహారాలు లేక.. ప్రజలు అల్లాడిపోయారు. ఆస్తులు పోగొట్టు కున్నారు. వాహనాలు పోగొట్టుకున్నారు. డబ్బులు పోగొట్టుకున్నారు. వీరిని ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం నానా ప్రయాసలు పడింది. సీఎం చంద్రబాబు నేరుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే కేంద్రం నుంచి కూడా సాయం ఆశించారు. ప్రాథమిక నష్టాలను అంచనా వేసిన ఏపీ ప్రభుత్వం సుమారు రూ.6880 కోట్లను తమకు తక్షణ సాయంగా అందించాలని వేడుకుంది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతోపాటు బాధిత ప్రాంతాల ఛాయా చిత్రాలతో పాటు.. వీడియోలను కూడా పెన్ డ్రైవ్‌లో వేసి పంపించింది. కేంద్రం నుంచి విపత్తు పరిశీలన బృందాలు వస్తే.. వాటిని కూడా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి పరిస్థితిని వివరించారు. ఇక, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీకి వచ్చి రెండు రోజులపాటు ఆయన క్షేత్రస్థాయిలో వరద నీటిలోనే పర్యటించి పరిస్థితిని కళ్లారా చూశారు.
దీంతో ఏపీ ప్రభుత్వం వరద సాయంపై కోటి ఆశలు పెట్టుకుంది. ఈ లోగా దాతల నుంచి విరాళాలు సేకరించి.. బాధితులకు పంచుతోంది. ఇదిలావుంటే.. తాజాగా కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యాయి. జాతీయ విపత్తు నివారణ కింద.. ఈ నిధులను పలు రాష్ట్రాలకు విడుదల చేశారు. దీనిలో ఏపీ రూ.6880 కోట్లు అడిగితే.. కేంద్రం ఇచ్చింది… మాత్రం రూ.1,036 కోట్లు, అంటే.. కనీసం మూడో వంతు నిధులు కూడా ఇవ్వలేదు. ఇదేసమయంలో వచ్చే కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రకు మాత్రం 1432 కోట్ల రూపాయలను కేటాయించింది.
ఈ పరిణామంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు ప్రధాన కారణమైన.. ఏపీ కష్టాల్లో ఉంటే ఇలానేనా సాయం చేసేదన్న వాదన వినిపిస్తోంది. నిధులు అడిగితే.. క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసిన తర్వాత కూడా.. విదిలింపులేనా? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. మరి ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on October 2, 2024 7:36 am
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…
ఆస్కార్ అవార్డుల్లో ఆధిపత్యం చలాయించే అన్ని సినిమాలకూ వసూళ్లు వస్తాయని గ్యారెంటీ లేదు. అలాగే వసూళ్ల మోత మోగించిన చిత్రాలకూ…