Political News

సుప్రీంకోర్టు వ్యాఖ్య‌లు.. ఏపీ స‌ర్కారు రియాక్ష‌న్ ఇదీ

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం క‌ల్తీ ఘ‌ట‌నపై ఏపీ ప్ర‌భుత్వం మ‌రోసారి స్పందించింది. తాజాగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో మంత్రి డీబీవీ స్వామి రియాక్ట్ అయ్యారు. హిందువులు ప‌విత్రంగా భావించే శ్రీవారి ల‌డ్డూ క‌ల్తీ అయిన మాట వాస్త‌వ‌మ‌ని.. త‌మ వ‌ద్ద ఆధారాలు ఉండ‌బ‌ట్టే సీఎం చంద్ర‌బాబు మీడియా ముందుకు వ‌చ్చార‌ని తెలిపారు. అయితే.. న్యాయ‌ప‌రంగా కొన్ని అంశాలు తెర‌మీదికి రావ‌డం స‌హ‌జ‌మేన‌ని అన్నారు.

సుప్రీంకోర్టు లేవ‌నెత్తిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు త‌మ వ‌ద్ద స‌మాధానం ఉంద‌న్న మంత్రి డీవీబీ స్వామి.. ముఖ్య మంత్రి చంద్ర‌బాబు శ్రీవారికి అమిత భ‌క్తుడు కావ‌డం వ‌ల్లే.. ర‌హ‌స్యాన్ని సైతం బ‌య‌ట‌కు చెప్పార‌ని అన్నారు. త‌మ ప్ర‌భుత్వంలో ఏదీ దాప‌రికం ఉండ‌ద‌ని చెప్ప‌డానికి ఇదే ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన్నా రు. గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అన్నీ దాచేసేద‌ని.. ఏ విష‌యాన్నీ ప్ర‌జ‌ల‌కు చెప్పేది కాద‌ని.. అందుకే అనేక కుంభ‌కోణాలు జ‌రిగాయ‌ని ఈ ప‌రంప‌ర‌లోనే తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూకు వినియోగించే నెయ్యిలోనూ క‌ల్తీ జ‌రిగింద‌న్నారు.

దీనికి సంబంధించిన ల్యాబు రిపోర్టుల‌ను మ‌రోసారి సుప్రీంకోర్టుకు అంద‌జేస్తామ‌ని మంత్రి చెప్పారు. ఇదే స‌మ‌యంలో న్యాయ‌స్థానాల విష‌యంలో త‌మ‌కు అమిత‌మైన గౌర‌వం ఉంద‌ని వ్యాఖ్యానించారు. న్యాయ‌స్థానం లేవ‌నెత్తిన అన్ని సందేహాల‌కు కూడా తాము స‌మాధానం ఇచ్చి తీరుతామ‌న్నారు. ఈ విష‌యంపై ఎలాంటి ద‌ర్యాప్తునైనా ప్ర‌భుత్వం స్వాగ‌తిస్తుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) ఈ కేసును విచారిస్తున్న‌ద‌ని తెలిపారు.

అయితే.. ఇది రాష్ట్ర ప్ర‌భుత్వ వ్య‌వ‌హారం కావ‌డంతో సీఎం చంద్ర‌బాబు.. ప్ర‌భుత్వ‌మే విచార‌ణ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా సిట్‌ను నియ‌మించామ‌న్నారు. అయితే, సుప్రీంకోర్టు క‌నుక మ‌రేదైనా సంస్థ‌తో ద‌ర్యాప్తు చేయించాల‌ని భావిస్తే.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఎలాంటి విచార‌ణ‌కైనా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌న్నారు. సీబీఐ స‌హా స్వ‌తంత్ర ద‌ర్యాప్తు సంస్థ కానీ, మాజీ న్యాయ‌మూర్తితో కానీ.. విచార‌ణ జ‌రిపించవ‌చ్చ‌ని స‌ర్కారుకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్పారు.

This post was last modified on October 1, 2024 2:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

25 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago