ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు అయి.. తీహార్ జైల్లో నెలల తరబడి ఉన్న ఎమ్మెల్సీ కవిత ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. జైల్లో ఉన్న వేళలో ఆమె ఆరోగ్యం బాగా పాడైనట్లుగా వార్తలు రావటం తెలిసిందే. తాజాగా ఆమె అనారోగ్యంతో హైదరాబాద్ మహానగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆడ్మిట్ అయ్యారు. ఈ రోజు (మంగళవారం) ఉదయం ఆమె వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారు.
ఉదయాన్నే తనకు తానే కుటుంబ సభ్యులతో కలిసి కారులో వచ్చిన ఆమె.. ఏఐజీ ఆసుపత్రిలోకి వెళ్లారు. అనంతరం ఆమెను ఆడ్మిట్ చేసిన సిబ్బంది.. వైద్య పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు పరీక్షలు పూర్తి అవుతాయని చెబుతున్నారు. తీహార్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె ఆరోగ్యం దెబ్బ తిన్న వేళలో ఢిల్లీ ఎయిమ్స్ లో ఆమెకు పరీక్షలు నిర్వహించారు.
లిక్కర్ స్కాంలో దాదాపు ఐదు నెలలకు పైనే ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వటంతో జైలు నుంచి విడుదలయ్యారు. అప్పటి నుంచి ఆమె ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ పాలు పంచుకోకుండా ఇంటికే పరిమితం అయ్యారు.
ఇటీవల కాలంలో ఆమె అస్సలు కనిపించటం లేదన్న మాట వినిపిస్తున్న వేళలోనే.. అనారోగ్యంతో ఆసుపత్రికి రావటం గమనార్హం. గైనిక్ సమస్యలతో బాధ పడుతున్న ఆమె.. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates