ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగో సారి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. జగన్ పాలనలో అతలాకుతలమైన రాష్ట్రానికి చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అవసరముందని గుర్తించిన ప్రజలు ఆయనను ఏరి కోరి ఎన్నుకున్నారు. అందుకే, తనను నమ్ముకున్న ప్రజల కోసం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడను వరదలు అతలాకుతలం చేస్తే వరద బాధితులకు నేనున్నాను అని చంద్రబాబు అండగా నిలిచారు.
ఏడు పదుల వయసులోనూ ముఫ్ఫై ఏళ్ల యువకుడిలా చంద్రబాబు కష్టపడ్డ వైనంపై ప్రశంసలు కురిశాయి. ఈ క్రమంలోనే తాజాగా విజయవాడలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సదరన్ రీజినల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేశ్…సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశఆరు.
నాలుగో సారి సీఎం అయినప్పటికీ చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన విధంగా కసితో పనిచేస్తున్నారని సీఐఐ సదస్సులో లోకేశ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రాష్ట్రానికి పరిశ్రమలు, కంపెనీలు తేవడం, లక్షలాది ఉద్యోగాలు సృష్టించండి వంటి అజెండాతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు. సీఎం చంద్రబాబు నిత్యం రాష్ట్రాభివృద్ధి, యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారని అన్నారు. పెట్టుబడుల వికేంద్రీకరణతో ముందుకు వెళుతున్నామని, ప్రతి జిల్లాలో ఒక్కో రంగంలో పెట్టుబడులు తీసుకువస్తున్నామని చెప్పారు.
ఏఐ వంటి సాంకేతికత కేంద్రంగా విశాఖను తీర్చిదిద్దుతామని, విశాఖ కేంద్రంగా ఐటీ, డేటా సెంటర్ ఏర్పాటు కు ప్రయత్నిస్తున్నామని లోకేశ్ చెప్పారు. ఐఎస్ బీ మోడల్ లో ఏఐ యూనివర్సిటీ స్థాపించే యోచనలో ఉన్నామని అన్నారు. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. నెల రోజుల్లో ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెట్టుబడుల కోసం కంపెనీల వద్దకే వస్తామని, నైపుణ్యం ఉన్న మానవ వనరులు కూడా ఏపీలో సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ నినాదంతో తమ ముఖ్యమంత్రి, తమ ప్రభుత్వం పనిచేస్తున్నాయని లోకేశ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates