రాష్ట్రంలో బీజేపీని పుంజుకునేలా చేయాలని.. సభ్యత్వాలను పెంచాలని రాష్ట్ర కమలనాథులకు టార్గెట్లు విధించా రు. దీనికి కేంద్రంలోని పెద్దలు పెద్ద టార్గెట్లే పెట్టారని తెలుస్తోంది.
కనీసంలో కనీసం లక్ష మందిని పార్టీలోకి తీసు కురావాలని.. నూతన సభ్యత్వాలు ఇప్పించాలని కూడా దిశానిర్దేశం చేశారు. దీంతో ఈ నెల 1వ తేదీ నుంచే రాష్ట్రం లో కమల నాథులు సభ్యత్వాలపై దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున బిల్ బుక్స్ రెడీ చేసుకున్నారు. సభ్యత్వ రుసుమును రూ.200గా నిర్ణయించారు.
ఇప్పటికే టీడీపీ రూ.200, జనసేన రూ.500గా సభ్యత్వ రుసుములు పెట్టిన విషయం తెలిసిందే. అయితే.. టీడీపీలో రుసుము లేకుండా కూడా సభ్యత్వం ఇస్తున్నారు. మరోవైపు.. టీడీపీ డిజిటల్ కూడా సభ్యత్వాన్ని ఇస్తోంది.
పైగా ఈ రెండు పార్టీలు గత నెలలోనే సభ్యత్వ నమోదును చేపట్టి.. దాదాపు పూర్తి చేశాయి. ఇలాంటి సమయంలో బీజేపీ సభ్యత్వ నమోదు చేపట్టినా.. పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఎక్కడ జరు గుతున్నాయో కూడా తెలియదు.
కానీ, బీజేపీ నాయకులు మాత్రం సభ్యత్వ నమోదు జరుగుతోందని చెబుతున్నా.. ఆ తరహా వాతావరణం మాత్రం కనిపించడం లేదు. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.. తప్పుకొన్నారు. తర్వాత కనీసం ఈ కార్యక్రమం ఎలా జరుగుతోందన్న విషయంపైనా ఆమె ఆరా తీసినట్టుకనిపించడం లేదు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏపీకి కేంద్రం నుంచి అందుతున్న సహకారం పెద్దగా లేకపోవడం.. మేం ఇది చేశాం.. ఇది చేస్తున్నాం.. అని చెప్పుకొనే అవకాశం కూడా లేకపోవడంతో సభ్యత్వాల నమోదు మందగించిందని తెలుస్తోంది.
ముఖ్యంగా సోము వీర్రాజు, విష్ణు వర్థన్‌రెడ్డి, మాధవ్ వంటి ఆర్ ఎస్ ఎస్ మూలాలు ఉన్న నాయకులు సభ్యత్వాన్ని తమకు సంబంధం లేదన్నట్టుగా వదిలేశారు. అంతా పురందేశ్వరి చూసుకుంటున్నారని.. తమ చేతిలో ఏమీ లేద న్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారు.
ఈ పరిణామాలతోనే బీజేపీ సభ్యత్వాన్ని పుచ్చుకునేవారు కనిపించకపోతే.. ఇచ్చే వారు కూడా కనిపించకుండా పోవడం గమనార్హం. మరి ఇలాగైతే.. పార్టీ పుంజుకునేనా? అనేది కొందరి ప్రశ్న.
This post was last modified on September 17, 2024 9:38 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…