Political News

జ‌గ‌న్ అరెస్టు కారు.. త‌మ్ముళ్ల కోరిక నెర‌వేర‌దు… !

టీడీపీలో ఉన్న కొంద‌రు ఔత్సాహిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల కోరిక ఏంటంటే.. త‌మ నాయ‌కుడు చంద్ర‌బాబును జ‌గ‌న్ హ‌యాంలో ఎలా అయితే.. అరెస్టు చేశారో.. ఇప్పుడు అలానే జ‌గ‌న్‌ను కూడా అరెస్టు చేయాల‌ని. అంతేకాదు.. మ‌రికొంద‌రైతే.. చంద్ర‌బాబును రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఏ బ్యార‌క్‌లో అయితే.. ఉంచారో.. ఎలా అయితే.. ఇబ్బంది పెట్టారో.. అచ్చం అదే బ్యార‌క్‌లో ఉంచి.. అచ్చం అలానే ఇబ్బంది పెట్టాల‌ని కూడా కోరుకుంటున్నారు. అందుకే త‌ర‌చుగా.. విజ‌య‌వాడ‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న ఈ మాట‌లే చెబుతున్నారు.

“మా నాయకుడు ప‌డ్డ క‌ష్టం జ‌గ‌న్‌కు కూడా రావాల‌ని కోరుకునే నాయ‌కుల్లో నేనే ముందుంటా!” అని గ‌త నెల‌లో నూ ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ మాట ఈయ‌న ఒక్క‌డిదే కాదు.. చంద్ర‌బాబును అభిమానించే ప్ర‌తి ఒక్క నాయ‌కు డి మాట కూడా ఇదే. కొన్నాళ్లుగా చంద్ర‌బాబుపై ఒత్తిడి కూడా పెరుగుతోంది.

వైసీపీ అధినేత‌పై ఎప్పుడు కేసులు పెడ‌తారంటూ.. వారు ప్ర‌శ్నిస్తున్న‌ట్టు క‌థ‌నాలు కూడా వ‌స్తున్నాయి. కానీ, చంద్ర‌బాబు ఈ విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పైగా.. జ‌గ‌న్ ను అరెస్టు చేసే ఉద్దేశం కూడా ఆయ‌న‌కు లేదు.

ఎందుకంటే.. జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తే.. ఏం జ‌రుగుతుందో.. త‌న అరెస్టుతో నిరూపిత‌మైంది. ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఇది నిజం. ఎందుకంటే.. అరెస్టు చేస్తే.. ప్ర‌జ‌ల్లో సింప‌తీ పెరుగుతుంది.

ఇప్ప‌టికే జ‌గ‌న్‌కు దాదాపు 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. ఇప్పుడు ఆయ‌నను అరెస్టు చేసి.. మ‌రింత సింప‌తీ పెంచే ఉద్దేశం చంద్ర‌బాబుకు లేదు. ఎందుకం టే.. గ‌తంలో నంద్యాల‌లో చంద్ర‌బాబును అరెస్టు చేసి, రాజ‌మండ్రికి త‌ర‌లించారు. దీంతో ఈ ప్ర‌భావం ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది.

నంద్యాల నుంచి రాజ‌మండ్రి వ‌ర‌కు ఉన్న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప్ర‌జ‌లు టీడీపీ నేత‌ల‌ను గెలిపించారు. ఇది అసాధార‌ణం. ఎందుకంటే.. అస‌లు పెద్ద‌గా బ‌లం లేని చోట కూడా.. టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అదేస‌మ యంలో బ‌ల‌మైన వైసీపీ కంచుకోట‌లు కూడా కూలిపోయాయి.

దీనికి కార‌ణం.. సింప‌తీనేన‌ని చంద్ర‌బాబు లెక్క‌. ఏపీ ప్ర‌జ‌ల‌కు ఎంత డ‌బ్బులిచ్చినా.. ఎన్ని ప‌థ‌కాలు అమ‌లు చేసినా.. ప‌డ‌తారో లేదో తెలియ‌దు కానీ.. చిన్న క‌న్నీటి చుక్క‌కు మాత్రం క‌రిగిపోతారు. ఇది తాజా ఎన్నిక‌ల్లోనూ నిజ‌మైంది. అందుకే.. జ‌గ‌న్‌ను అరెస్టు చేసే ఉద్దేశం చంద్ర‌బాబుకు లేద‌ని స్ప‌ష్టంగా లేద‌ని తెలుస్తోంది.

This post was last modified on September 15, 2024 11:32 am

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

ఇకపై ఆలస్యం చేయను – అల్లు అర్జున్

ఒకే సినిమాపై సంవత్సరాల తరబడి ఖర్చు చేయడం బాహుబలి నుంచే మొదలయ్యిందని చెప్పాలి. గతంలో అంజి, అమ్మోరు లాంటివి సుదీర్ఘ…

31 mins ago

పుష్ప 2 సెన్సార్ అయిపోయిందోచ్ : టాక్ ఎలా ఉందంటే…

ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…

3 hours ago

అప్పట్లో శ్రీలీల డేట్స్ అంటే పెద్ద ఛాలెంజ్, కానీ ఇప్పుడు…

బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…

4 hours ago

బోల్డ్ ఫోటోషూట్ తో కట్టి పడేస్తున్న మిల్కీ బ్యూటీ!

2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…

4 hours ago

ఆర్సీబీకి ‘హిందీ’ సెగ.. తెలుగు లేదా?

దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…

4 hours ago

నా రికార్డింగ్స్ వాడుకుంటే నీకైనా నోటీసులే : వెట్రి మారన్ తో ఇళయరాజా!

ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…

5 hours ago