టీడీపీలో ఉన్న కొందరు ఔత్సాహిక నాయకులు, కార్యకర్తల కోరిక ఏంటంటే.. తమ నాయకుడు చంద్రబాబును జగన్ హయాంలో ఎలా అయితే.. అరెస్టు చేశారో.. ఇప్పుడు అలానే జగన్‌ను కూడా అరెస్టు చేయాలని. అంతేకాదు.. మరికొందరైతే.. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏ బ్యారక్‌లో అయితే.. ఉంచారో.. ఎలా అయితే.. ఇబ్బంది పెట్టారో.. అచ్చం అదే బ్యారక్‌లో ఉంచి.. అచ్చం అలానే ఇబ్బంది పెట్టాలని కూడా కోరుకుంటున్నారు. అందుకే తరచుగా.. విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఈ మాటలే చెబుతున్నారు.
“మా నాయకుడు పడ్డ కష్టం జగన్‌కు కూడా రావాలని కోరుకునే నాయకుల్లో నేనే ముందుంటా!” అని గత నెలలో నూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాట ఈయన ఒక్కడిదే కాదు.. చంద్రబాబును అభిమానించే ప్రతి ఒక్క నాయకు డి మాట కూడా ఇదే. కొన్నాళ్లుగా చంద్రబాబుపై ఒత్తిడి కూడా పెరుగుతోంది.
వైసీపీ అధినేతపై ఎప్పుడు కేసులు పెడతారంటూ.. వారు ప్రశ్నిస్తున్నట్టు కథనాలు కూడా వస్తున్నాయి. కానీ, చంద్రబాబు ఈ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. పైగా.. జగన్ ను అరెస్టు చేసే ఉద్దేశం కూడా ఆయనకు లేదు.
ఎందుకంటే.. జగన్‌ను అరెస్టు చేస్తే.. ఏం జరుగుతుందో.. తన అరెస్టుతో నిరూపితమైంది. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది నిజం. ఎందుకంటే.. అరెస్టు చేస్తే.. ప్రజల్లో సింపతీ పెరుగుతుంది.
ఇప్పటికే జగన్‌కు దాదాపు 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. ఇప్పుడు ఆయనను అరెస్టు చేసి.. మరింత సింపతీ పెంచే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. ఎందుకం టే.. గతంలో నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసి, రాజమండ్రికి తరలించారు. దీంతో ఈ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.
నంద్యాల నుంచి రాజమండ్రి వరకు ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజలు టీడీపీ నేతలను గెలిపించారు. ఇది అసాధారణం. ఎందుకంటే.. అసలు పెద్దగా బలం లేని చోట కూడా.. టీడీపీ విజయం దక్కించుకుంది. అదేసమ యంలో బలమైన వైసీపీ కంచుకోటలు కూడా కూలిపోయాయి.
దీనికి కారణం.. సింపతీనేనని చంద్రబాబు లెక్క. ఏపీ ప్రజలకు ఎంత డబ్బులిచ్చినా.. ఎన్ని పథకాలు అమలు చేసినా.. పడతారో లేదో తెలియదు కానీ.. చిన్న కన్నీటి చుక్కకు మాత్రం కరిగిపోతారు. ఇది తాజా ఎన్నికల్లోనూ నిజమైంది. అందుకే.. జగన్‌ను అరెస్టు చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదని స్పష్టంగా లేదని తెలుస్తోంది.