తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుండి 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుని బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. మొత్తానికి విజయవంతంగా 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. మిగిలిన 16 మందిని చేర్చుకునే విషయంలో అడుగులు ముందుకు పడడం లేదు.
ఈ నేపథ్యంలో పార్టి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదు చేసి, హైకోర్టును ఆశ్రయించింది. ముందుగా ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హత అంశాన్ని నాలుగు వారాలలో తేల్చాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేల మీద కూడా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పట్టుబడుతున్నది. 26 మంది చేరే అవకాశం లేదని తేలిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హత వేటు నుండి కాపాడుకునేందుకు కొత్త ప్లాన్ తెరమీదకు తెచ్చింది. శాసనసభలో ఉన్న నిబంధన ప్రకారం ఏదైనా పార్టీ నుండి నాలుగో వంతు మంది సభ్యులు బయటకు వచ్చి తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరితే అనర్హత వేటు నుండి తప్పించుకునే అవకాశం ఉంటుందని, ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. దానం నాగేందర్ ఏకంగా ఎంపీగా పోటీ చేయగా, పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యవసాయ సలహాదారు పదవి దక్కింది. ఈ ఆధారాలు అన్నీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో కీలకం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్లాన్ బి ఎంత వరకు ఫలిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on September 15, 2024 12:09 pm
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…