వలసవాద బ్రిటీష్ విధానాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్థి చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్రిమినల్ చట్టా లను మార్పు చేశారు. రెండు రోజుల కిందట.. అండమాన్ రాజధాని పోర్టు బ్లెయిర్ పేరును శ్రీవిజయపురంగా మార్చారు. ఇలా.. వలసవాదుల కాలంలో ఉన్న పద్ధతులు, విదానాలు.. పేర్లను మార్పు చేస్తున్నారు. ఈ పరంపరలో ఇప్పుడు ఏపీ సర్కారు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఉన్న ఒక కీలక అంశానికి సరికొత్త మార్పుల దిశగా అడుగులు వేసింది.
అవే.. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు. భూముల లావాదేవీలు, వివాహాల రిజిస్ట్రేషన్ వంటి కీలక కార్యకలాపాలతో రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు.. రద్డీగా ఉంటాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదాయ వనరు అన్న విషయం తెలిసిందే. అయితే.. ఇక్కడ 75 ఏళ్లుగా.. అప్పట్లో బ్రిటీష్ హయాంలో ఎలాంటి పద్ధతులు ఉన్నాయో.. వాటినే అమలు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్.. ఎత్తయిన పీఠంపై కూర్చుని ఉంటాడు. దాదాపు ఐదు అడుగుల పోడియం ప్రత్యేకంగా ఉంటుంది.
మిగిలిన వారంతా.. ఆయనకు దిగువన కూర్చుని పనులు చేస్తారు. అంతేకాదు.. సబ్ రిజిస్ట్రార్ కూర్చునే పోడియం చుట్టూ రెడ్ కార్పెట్ వేసిప్రత్యేకంగా ఉంటుంది. ఆయన దగ్గరకు వెళ్లి ఎవరు మాట్లాడాలన్నా.. నిలబడే ఉండాలి. ఇది బ్రిటీష్ వారి కాలంలో చేసిన ఏర్పాటు. అయితే.. ఇప్పుడు ఈ విధానాన్ని మార్పు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ వెంటనే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇక నుంచి మిగిలిన ఉద్యోగుల మాదిరిగానే సబ్ రిజిస్ట్రార్‌కు కూడా కుర్చీ వేయాలని నిర్దేశించారు.
అంతేకాదు.. సబ్ రిజిస్ట్రార్‌ను ప్రత్యేకంగా సంబోధించాల్సిన అవసరం లేదని.. సాధారణ ఉద్యోగిగానే పరిగణించా లని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాదు.. పోడియం.. దానిపై రెడ్ కార్పెట్‌వంటివాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారికి ఆఫీసు ఖర్చుతో తాగునీరు, టీ, కాఫీ సదుపాయాలు కల్పించాలని.. వారు కూర్చునేందుకు ప్రత్యేకంగా కుషన్ సీట్లు ఉన్న కుర్చీలు వేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ సబ్ రిజిస్ట్రార్ ఎక్కువ.. ప్రజలు తక్కువ అనే భావన కనిపించడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం గమనార్హం.
This post was last modified on September 15, 2024 12:08 pm
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్‌కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…