రాజకీయం రంగులు మార్చుకుంటుంది. ఇది ఫక్తు వాస్తవం. ముందు ఒక మాట అనేయడం.. దాని వల్ల వచ్చే పర్వ వసానాలు తమకు అనుకూలంగా ఉంటే.. రెచ్చగొట్టడం.. రెచ్చిపోవడం కామన్. ఏ చిన్న తేడా వచ్చి.. పెద్ద యాగీ జరుగుతుందని గుర్తించినా.. వెంటనే వెంటనే యూటర్న్ తీసుకోవడం.
ఇదీ.. ఇప్పుడు తెలంగాణలో రంగులు మార్చుకున్న రాజకీయం చెబుతున్న సరికొత్త పాఠం. అసలు వివాదానికి కారకులు ఎవరు? ఎక్కడ వివాదం మొద లైంది? అనే తలతోకను గుర్తించకుండా.. కేటీఆర్ వంటి సీనియర్ రాజకీయ నేత ఇప్పుడు విరుచుకుపడుతున్నా రు.
అసలు వాస్తవం ఏంటి? పాడి కౌశిక్ రెడ్డి అనే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అది కూడా మూడు శుక్రవారాలు కూడా నిండా కాని.. దుందుడుకు నాయకుడిని ముందు పెట్టి.. రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది ఎవరో తెరచాటున ఉండి నాన్ లోకల్-లోకల్ వ్యాఖ్యలుచేసింది ఎవరో.. పెద్దగా పసిగట్టలేని జనాలు ఎవరూ లేరు.
పైగా.. తెలంగాణ ఉద్యమం.. తర్వాత పాలనతో రాజకీయాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉంది. సో.. పాడి ఒక్కడే అంత మాటలు అనే స్తాయి.. అనే సత్తా ఉన్న నాయకుడని ఎవరూ అనుకోరు.
ఇదివాస్తవం. అయితే.. లోకల్-నాన్‌లోకల్ వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. చివరకు కేసీఆర్ మళ్లీ కేంద్రం అయ్యారు. ఆయన లేనిపోని రాజకీయాలు చేస్తున్నారన్న వాదన ప్రజల్లో క్షణాల్లో ప్రబలి పోయింది. అంతే.. వెంటనే యూటర్న్ తీసుకుని ఎదురు దాడి చేయడం కేటీఆర్, హరీష్‌రావు లు ఒక ఉద్యోగంగా తీసుకున్నారు.
అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఇష్టంలేకపోతే.. దానిని వేరే మార్గం ద్వారా ప్రశ్నించవచ్చు. కానీ, అసలు విషయం ఇదికాదు. హైడ్రాతో తమ వారు ఇబ్బందులు పడుతున్నారన్నది నిజం.
దీనిని వెలుగు లోకి తీసుకురాలేక.. కౌశిక్‌రెడ్డి భుజాలపై తుపాకీ పెట్టి.. తూటాల్లాంటి వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ.. ఆతూటాలు.. రేవంత్‌ను టార్గెట్ చేయాలని అనుకున్నా.. విధిలేని పరిస్థితిలో కేసీఆర్‌కు తగిలే ప్రమాదం ఏర్పడింది.
దీంతో ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని.. “పాఫం! కౌశిక్ రెడ్డి” అంటూ.. ఇప్పుడు రాజకీయాలను మార్చే ప్రయత్నం.. ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల్లో వివాదమే లేనప్పుడు కేటీఆర్ అంత హుటాహుటిన స్పందించాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ.. బూమరాంగ్ అయి.. తమ మెడకు చుట్టుకుంటున్న దరిమిలా.. తప్పని పరిస్థితి ఏర్పడింది!! ఇదీ.. అసలు రాజకీయం!!!
This post was last modified on September 14, 2024 3:16 pm
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…