“తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ.. చిట్టినాయుడు. మేం చంద్రబాబు నాయుడితోనే కొట్టాడినం. ఈయనెం త?” అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఎమ్మెల్యే కేటీఆర్ సెటైర్లు గుప్పించారు.
తాజాగా తెలంగాణలో జరుగు తున్న రాజకీయ వివాదానికి మూల కారణమైన సొంత పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించారు. ఆయన ఇంటికి నేరుగా వెళ్లిన కేటీఆర్.. ఆలింగనం చేసుకుని.. ధైర్యం చెప్పారు. మేమున్నామంటూ.. వెనుకేసుకువచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాము వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు వంటివారితోనే కొట్లాడామని చెప్పారు.
అలాంటిది చిట్టినాయుడు రేవంత్‌రెడ్డి ఎంత? అని ప్రశ్నించారు. అంతేకాదు.. తెలంగాణ చరిత్రలో ఎంతో మంది పనికిమాలిన ముఖ్యమంత్రులను చూశామన్నారు.
“నీలాంటి(రేవంత్) తలమాసిన సీఎంలను మస్తుగ చూశాం” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, రోశయ్య, వైఎస్, కిరణ్‌కుమార్ లాంటి ఎంతో మందితో బీఆర్ ఎస్ కొట్లాడిందన్నారు. “ఇప్పుడు వాళ్లతో పోల్చుకుంటే నువ్వెంత? నువ్వు చిట్టి నాయుడివి. మా బాషలో చెప్పాలంటే.. నువ్వు బుల్లబ్బాయ్‌వి!” అని కేటీఆర్ సెటైర్లు వేశారు.
“మాకేం ఫరక్ పడేది లేదు. వెంట్రుక కూడా పీకలేవు. కానీ, నాలుగు రోజులు ఏదో పైశాచిక ఆనందం. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాను. నేనేదో పెద్దవాడిని అయ్యానని ఎగిరెగిరి పడుతున్నావ్” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఈ దుష్ట సంప్రదాయం రేపు పదవి నుంచి దిగిపోయాక కూడా వెంటా డుతుంది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డిని కేటీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. `టైగర్ కౌశిక్ భాయ్` అని వ్యాఖ్యానించారు.
This post was last modified on September 14, 2024 3:12 pm
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సంక్రాంతి వేళ భారీ ఎదురు దెబ్బ తగిలింది.…
క్వీన్, మణికర్ణిక లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్తో ఒక టైంలో బాలీవుడ్లో తిరుగులేని స్థాయిని అందుకుంది కంగనా. అప్పట్లో ఆమెకు…
సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ వేడుక. కలవారు.. లేనివారు అనే తేడా లేకుండా చేసుకునే పండుగ ఇది. కనీసంలో కనీసం..…
రెండున్నర గంటలు అండర్ కవర్ ఆపరేషన్ చేసి సినిమా చివర్లో ట్విస్ట్ ఇచ్చే హీరోలాగా పండగ బరిలో లాస్ట్ వచ్చిన…
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎన్నికల హీట్ ఉడికిస్తోంది. అదే సమయంలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)…
క్రియేటివిటీకి కాదేది అనర్హం అని పెద్దలు ఊరికే అనలేదు. కొత్త తరం దర్శకుల ఆలోచనలు చూస్తే అదే అనిపిస్తుంది. గత…