అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని భావించిన రిపబ్లికన్లకు.. భారీ షాక్ తగిలింది. తాజాగా జరిగిన అధ్యక్ష అభ్యర్థుల డిబేట్‌లో రిపబ్లికన్ అభ్యర్థి.. దూకుడు నాయకుడు, ఫైర్ బ్రాండ్ డొనాల్డ్ ట్రంప్ బాగా వెనుకబడి పోయారు. ప్రత్యర్థి మాటల్లో చెప్పాలంటే.. ట్రంప్ ఒకరకంగా డమ్మీ అయ్యారు. అనేక ప్రశ్నలకు ఆయన తడబడ్డారు. అంతేకాదు.. ఆయనపై డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ అనూహ్యమై న పైచేయి సాధించారు.
అచ్చం భారత్‌లో మాదిరిగానే.. అమెరికా రాజకీయాలు కూడా తాజా డిబేట్‌లో కనిపించారు. వ్యక్తిగత విమ ర్శల నుంచి జాతీయత వరకు.. ప్రజా సమస్యల నుంచి పాలన వరకు అనేక విషయాలు.. విమర్శలు.. ప్రతివిమర్శలు.. ఏవగింపులు.. వికృత వ్యాఖ్యలు ఇలా అన్నీ కనిపించాయి. ఒక సందర్భంగా కమల జాతీయను ట్రంప్ ఏకిపారేశారు. కానీ, దీనికి ఆమె.. అమెరికా ప్రజలను జాతి పేరుతో విడదీయాలని చూస్తున్నారని ఎదురు సమాధానం చెప్పేసరికి.. ట్రంప్ మూగనోము పట్టారు.
అంతేకాదు.. ప్రస్తుతం అమెరికాలో అబార్షన్ వ్యవహారం అత్యంత కీలకంగా మారింది. గర్భిణులకు సెల వులు ఇచ్చేందుకు ప్రైవేటు సంస్థలు అంగీకరించడం లేదు. దీంతో ఉద్యోగులకు ఇబ్బందిగా ఉంది. ఈ నేపథ్యంలో అబార్షన్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అదేసమయంలో సహజీవనం చేసే వ్యక్తులు కూడా అబార్షన్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామాలు..ఇ ప్పుడు ఎన్నికల సమయంలోనూ కీలకంగా మారాయి. దీనికి కమల హ్యారిస్ మద్దతుగా మాట్లాడారు.
అదేసమయంలో మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్న పన్నుల తగ్గింపు విషయంలో ట్రంప్ దాట వేత ధోరణి ప్రదర్శించగా.. హ్యారిస్ నిర్దిష్ట విధానం ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. పన్నులు తగ్గిస్తామని కుండబద్దలు కొట్టారు. ఇది ఆమెకు మంచి మార్కులు పడేలా చేసింది. అలాగే.. పర్యావరణ పరిరక్షణ విషయం ప్రస్తావించకుండానే.. హ్యారిస్ కిలక ప్రకటన చేశారు. ప్లాస్టిక్‌ను నిరోధించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఇది అమెరికన్లను మరింత విశేషంగా ఆకర్షించింది. మొత్తంగా చూస్తే.. ట్రంప్ చాలా వరకు వెనుకబడిపోగా.. హ్యారిస్ అనూహ్యంగా ముందంజలో కొనసాగుతున్నారు. దీంతో రిపబ్లికన్ల ఆశలు గల్లంతవగా.. అధికార డెమొక్రాట్ల ఆశలు సజీవంగా నిలబడ్డాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates