అధికారంలో ఉండగా.. ఏం చేసినా చెల్లుతుందని భావించేవారు చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత ఎవరు మాత్రం పట్టించుకుంటారు.. అధికారం ఉండగానే నాలుగు రాళ్లు వెనుకేసుకుందామని భావిస్తున్నారు. నయానో భయానో.. ఇలా కోట్ల రూపాయలు పోగేసుకున్నవారు.. చాలా మంది ఉన్నారు. అయితే.. ఇప్పుడు ప్రభుత్వం మారడంతోపాటు.. తమకు లభిస్తున్న భరోసా కారణంగా.. నాటి బాధితులు నేడు న్యాయం కోసం క్యూ కడుతున్నారు.
ఇలాంటి వారిలో గుంటూరు జిల్లా యడ్లపాడుకు చెందిన నల్లపనేని చలపతిరావు.. తెరమీదికి వచ్చారు. ఈయన యడ్లపాడులోని ఓ స్టోన్ క్రషర్(కంకర ఉత్పత్తి) యజమాని. తన మిత్రులతో కలిసి ఈయన కొన్ని దశాబ్దాలుగా స్టోన్ క్రషర్‌ను నిర్వహిస్తున్నారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో అనూహ్యంగా ఎన్నికలకు ఏడాది ముందు.. అప్పటి మంత్రి విడదల రజనీ.. తనను బెదిరించారని.. 5 కోట్ల రూపాయలు కప్పం కట్టాలని ఆమె తన అనుచరులతో బెదిరింపులకు దిగారని చలపతిరావు పేర్కొన్నారు.
అయితే.. ఎందుకు చెల్లించాలని తన మిత్రులు ప్రశ్నించగా.. అప్పటి ఓ పోలీసు అధికారితో నిర్బంధించి వేదింపులకు గురి చేశారు. ఇస్తే.. ఐదు కోట్లతో పోతుంది. లేకపోతే.. క్రషర్ యూనిట్టే మూసుకోవాల్సి వస్తుందని అధికారులు ఒత్తిడి చేసినట్టు చలపతిరావు పేర్కొన్నారు. దీంతో తన మిత్రులు వ్యాపారం నుంచి విరమించుకోగా.. తాను అప్పులు చేసి రజనీ చెప్పిన వారికి రూ.2.20 కోట్ల రూపాయలను చెల్లించానని ఆయన తెలిపారు.
ఈ మొత్తానికి ఇప్పుడు వడ్డీలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నానని.. తనకు ఆ సొమ్ము వెనక్కి ఇప్పించాలని చలపతిరావు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారంపై పోలీసులు ఏం చేయాల ని ఆలోచనలో పడ్డారు. కేసు పెట్టి విచారణ చేస్తే.. ఏళ్ల తరబడి కేసు అలానే సాగుతుంది. అలాగని వదిలేస్తే.. ఆత్మహత్య తప్పదన్న చలపతిరావు కు న్యాయం జరగదు. సో.. ఈ పరిణామాలను గుంటూరుకు చెందిన ముఖ్య నేతలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates