టీడీపీ ఆఫీసుపై వైసీపీ నాయకులు చేసిన దాడిని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సమర్థించుకున్నా రు. తమ పార్టీ నాయకులు చేసింది తప్పుకాదన్నారు. “టీడీపీకి చెందిన ఒక ప్రబుద్ధుడు నన్ను బోష్‌డీకే అన్నాడు. దీని అర్థం.. మీకు తెలుసు. లం.. కొడక అని.. మరి నన్ను ఇంతగా తిడితే.. నా పార్టీ వాళ్లకు కోపం రాదా. అందుకే.. టీడీపీ ఆఫీసుపై చిన్న దాడి చేశారు. దీనిలో తప్పేముంది“ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇదే కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ నందిగం సురేష్.. గుంటూరు జైల్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో సురేష్‌ను పరామర్శించేందుకు బుధవారం జైలుకు వచ్చిన జగన్.. మీడియాతో మాట్లాడా రు. చంద్రబాబుపై ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. తప్పు చేస్తే శిక్షించవచ్చని.. కానీ.. అసలు తప్పులన్నీ.. చంద్రబాబే చేస్తున్నారని, కానీ, శిక్షలు మాత్రం వైసీపీ నాయకులకు వేస్తున్నారని వ్యాఖ్యా నించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని.. ఎవరి కాళ్లూ పట్టుకుని చంద్రబాబు లాగా మేనేజ్ చేసుకోబోమన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని జగన్ చెప్పారు. చంద్రబాబు ను నమ్మి ప్రజలు ఓటేశారని.. కానీ, ప్రజలను ఆయన అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని విమర్శించారు. సూపర్ సిక్స్ ఏమయ్యాయని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉంటే.. ఇప్పటికే అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యాకానుక వంటివి ప్రజలకు అంది ఉండేవని.. కానీ, చంద్రబాబు ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రజలకు అన్యాయం చేశారని విమర్శలు గుప్పించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా సూపర్ సిక్స్ గురించి మాట్లాడడం లేదన్నారు.
ఒకే సినిమాపై సంవత్సరాల తరబడి ఖర్చు చేయడం బాహుబలి నుంచే మొదలయ్యిందని చెప్పాలి. గతంలో అంజి, అమ్మోరు లాంటివి సుదీర్ఘ…
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…