విజయవాడలోని శివారు ప్రాంతాలు నీట మునగడానికి కారణమైన బుడమేరు వరదను అరికట్టేందుకు.. సజావుగా వాగు సాగేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్మీ సాయం తీసుకుంటోంది. చెన్నై, విశాఖ, సికింద్రాబాద్ నుంచి వచ్చిన 150 మందికి పైగా సైన్యం.. బుడమేరు ప్రాంతంలో గండ్లు పూడ్చే పనిని విడతల వారీగా చేస్తున్నారు. ప్రధానంగా బుడమేరుకు మూడు గండ్లు పడ్డాయి. వీటి నుంచే నీరు భారీ ఎత్తున నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకువచ్చింది.
అయితే..ఈ గండ్లలో రెండింటిని రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులు గురువారం రాత్రి సమయానికి పూడ్చి వేశారు. కానీ, ప్రధానమైన మూడో గండి మాత్రం పూడ్చేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇది సాధ్యం కాలేదు. దీంతో ఆర్మీ సాయం తీసుకుంటున్నారు. రంగంలోకి దిగిన ఆర్మీ ఇంజనీరింగ్ అధికారులు. గండి పూడ్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను తొలుత అధ్యయనం చేశారు. ఎన్ని రాళ్లు వేసినా.. ఎంత మట్టి పొసినా.. గండి పూడడం లేదని గుర్తించారు. దీంతో కొత్త ఆలోచన చేశారు.
దీంతో ఇనుప బుట్టలు తయారు చేసి.. వాటిలో రాళ్లను, మట్టిని నింపి.. గండి పడిన చోట వేయాలని నిర్ణయించారు. దీంతో హుటాహుటిన వెల్డర్లను తీసుకువచ్చి.. పటిష్టమైన ఇనుముతో పెద్ద పెద్ద ఇనుప బుట్టలను తయారు చేయిస్తున్నారు. వీటిలో వేసేందుకు కంకర, మట్టి, ఇసుక, సిమెంటును కూడా సిద్ధం చేసుకున్నారు. వీటి ద్వారా.. మూడో గండిని పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బుట్లలను గేబియాన్
అంటారని ఆర్మీ అధికారులు తెలిపారు.
మూడో గండి ప్రాంతం 80 నుంచి 100 మీటర్ల ఉందని, దీనిని పూడ్చేందుకు సమయం పడుతుందని చెప్పారు. శనివారం ఉదయానికి పని పూర్తవుతుందన్నారు. మరోవైపు.. ఆర్మీ అధికారులకు, ఇంజనీర్లకు ఇరిగేషన్ అధికారులు సాయం చేస్తున్నారు. వారి సూచనలను తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షిస్తున్నారు. దీంతో గండి పూడికపై అధికారులు భరోసా వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on September 9, 2024 10:39 am
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…