Political News

ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు.. వెతుకుతున్న పోలీసులు

అత్యాచారం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు న‌మోదు చేశారు. బాధితురాలు, టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు ఫిర్యాదు మేరకు ఆదిమూలంపై సెక్స్ వల్ హెరాస్ మెంట్, పోస్కో చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. తిరుప‌తిలోని భీమాస్ పారడైజ్ రూమ్ నంబర్ 105, 109లో త‌న‌ ప్రమేయం లేకుండానే ఆదిమూలం ప‌లు మార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు.

దీంతో ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబ‌రు 430/2024తో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదేస‌మ‌యం లో భీమాస్ పారడైజ్ హోటల్ లో సి.సి. టీవీ పుటేజీ సేకరించారు. అదేస‌మ‌యంలో హోట‌ల్ య‌జమాని పైనా కేసు పెట్టిన‌ట్టు తెలిపారు. మ‌రోవైపు టీడీపీ ఇప్ప‌టికే ఆదిమూలంను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిం ది. ఆయ‌న‌పై అంత‌ర్గ‌త విచార‌ణ‌కు పార్టీ క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీని నియ‌మించిన రెండు రోజుల్లోనే నివేదిక ఇచ్చేలా చూస్తామ‌ని.. పార్టీ ఏపీ అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీనివాస‌రావు తెలిపారు.

ఇదిలావుంటే, త‌న‌పై అత్యాచార ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆదిమూలం త‌న కుమారుడితో స‌హా.. అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు. అయితే.. ఆయ‌న చెన్నైలో ఉన్నార‌న్న స‌మాచారం మేర‌కు ఒక బృందం పోలీసులు.. అక్క‌డ‌కు వెళ్లి ఆయ‌న కోసం వెతుకుతున్నారు. ఇక‌, ఆదిమూలం వ్య‌వ‌హారాన్ని స్థానిక టీడీపీ నాయ‌కులు తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నారు. ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డం కాదు.. ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రోవైపు.. త‌మ‌పై కుట్ర చేశార‌ని.. వైసీపీ నాయ‌కులు ఉన్నార‌ని.. ఆదిమూలం కుటుంబ స‌భ్యులు ముఖ్యంగా ఆయ‌న కుమార్తెలు ఇద్ద‌రు చెబుతున్నారు. త‌మ‌ను కావాల‌నే ఇరికించార‌ని.. త‌మ తండ్రి 50 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఎలాంటి మ‌చ్చ లేకుండా జీవించార‌ని వారు చెబుతున్నారు. దీంతో తిరుప‌తి టీడీపీలో ఆదిమూలం వ్య‌వ‌హారం ఉత్కంఠ‌గా మారింది. చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on September 6, 2024 1:58 pm

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

1 hour ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

3 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

3 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

4 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

4 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

5 hours ago