వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఎక్కడ మాట్లాడినా.. స్క్రిప్టును కళ్ల ముందు ఉంచుకుని చదవడం తెలిసిందే. అయితే.. ఇటీ వల ఓడిపోయిన తర్వాత.. ఆయన అసలు బయటకే రావడం లేదు. వచ్చినా.. ఏదో నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఎన్నికల తర్వాత.. ఫలితం వచ్చాక.. జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లోనూ.. ఆయన చూసే చదివారు. అయినప్పటికీ.. ఆయన తడబడ్డారు. కాగా.. జగన్ ఎప్పుడు మాట్లాడినా.. ఆ విషయాలు సోషల్ మీడియాలో భారీగా ఎత్తున హైలెట్ అవుతా యి. దీనికి కారణం.. కొన్ని కొన్ని విషయాల్లో ఆయన తలా తోకా లేకుండా మాట్లాడడమే.
అది కూడా.. చిన్నపిల్లలకు తెలిసిన విషయాలు కూడా ఆయనకు తెలియకపోవడమే! హైవే టోల్ గేట్ దగ్గర బైకులు ఎందుకు ఆగుతాయంటే.. టోల్ గేట్ కట్టేందుకని జగన్ చెబుతారు. ఇక, ఏపీలో కష్టాలకు చంద్రబాబు పాలనే కారణమని అంటారు. వరదలకు బాబుకు ముడిపెట్టేసి ఆయన తాజాగా ఏదో చెప్పాలని అనుకున్నారు. కానీ, చిత్రంగా ఆయనకు ఆయనే బుట్టలో పడ్డారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల ఓటింగ్.. ఫలితాలకు సంబంధించి.. జగన్ భారీగానే తడబడ్డారు. ఏదైనా ఒక తడబాటు జరిగినప్పుడు.. దానిని ఎంటనే సరిచేసుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తారు. కానీ, జగన్ సర్.. మాత్రం ఏమాత్రం సరిచేసుకునే ప్రయత్నం చేయలేదు.
పైగా తడబడిన పదాన్ని పదే పదే చెప్పుకొచ్చారు. “మే 13న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటికి నాలుగు మాసాలైంది. మరి చంద్రబాబు ఏం చేస్తున్నాడు” అని జగన్ తాజాగా ప్రశ్నించారు. ఈ మాటను ఆయన పదే పదే చెప్పుకొచ్చా రు. అయితే.. చిత్రం ఏంటంటే.. అసలు ఎన్నికలు పోలింగ్ జరగింది.. మే 13న , ఫలితం వచ్చింది మాత్రం జూన్ 4న. ఈ విషయం తెలిసి కూడా.. జగన్ ఎందుకో.. మరిచిపోయినట్టున్నారు. ఆయన ఓటమి తాలూకు పరాభవం నుంచి ఇంకా బయటకు వచ్చిన ట్టుగా కనిపించడం లేదని అంటున్నారు నెటిజన్లు. గతంలోనూ ఆయన అనేక సందర్భాల్లో తడబడిన పరిస్థితి ఉంది. కానీ.. ఇప్పుడు ఏకంగా ఎన్నికలు ఫలితంపైనే పదే పదే తడబడడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
This post was last modified on September 5, 2024 11:20 am
ఇండస్ట్రీని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న పైరసీ గురించి కొత్తగా చెప్పేందుకు ఏమి లేదు కానీ నిన్నా మొన్నటిదాకా ఇవి…
'ప్రేమ కోసమే వలలో పడినె పాపం పసివాడు' అంటూ అప్పటి పాతాళ భైరవి సూపర్ హిట్ పాట.. ఇప్పటి తరానికి…
ఇంకో వారం రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ కోసం తెలుగులోనే కాదు తమిళంలో కూడా చెప్పుకోదగ్గ బజ్ కనిపిస్తోంది.…
గత ఏడాది భారతీయుడు 2 రిలీజైనప్పుడు దర్శకుడు శంకర్ కెరీర్ లోనే మొదటిసారి విపరీతమైన ట్రోలింగ్ కు గురయ్యారు. ఐ,…
ఏదో క్యాస్టింగ్ పెద్దగా లేని సినిమా ల్యాబ్ లో మగ్గుతుందంటే సహజం అనుకోవచ్చు. కానీ పేరున్న హీరో, ఇమేజ్ ఉన్న…
అవును.. ఇప్పుడు చెప్పే ఉదంతాన్ని చదివినంతనే.. యమలోకంతో కనెక్షన్ ఉండే చాలా సినిమాలు ఇట్టే గుర్తుకు వచ్చేస్తాయి. నూకలు తీరకుండానే…