చంద్ర‌బాబు ఒంట‌రి పోరాటం.. ఎందాకా ..!

75 ఏళ్ల వ‌య‌సు.. ముఖ్య‌మంత్రి హోదా.. వీటిని సైతం ప‌క్క‌న పెట్టి టీడీపీ అధినేత చంద్ర‌బాబు మోకాల్లో తు నీటిలో తిరుగుతున్నారు. సాధార‌ణ ఎమ్మెల్యేనే మురుగు నీటిలోకి, వ‌ర‌ద నీటిలోకి అడుగు కూడా పెట్టేందుకు సందేహించే రోజులు ఇవి. ఇలాంటి స‌మ‌యంలో త‌న వ‌య‌సును, హోదాను కూడా ప‌ట్టించుకోకుండా.. ప్ర‌జ‌ల కోసం.. అర్థ‌రాత్రి, అప‌రాత్రి వేళ‌ల్లో కూడా.. చంద్ర‌బాబు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. విజ‌య‌వాడ క‌లెక్ట‌రేట్‌నే ముఖ్య‌మంత్రి నివాసం మార్చుకున్నారు.

అక్క‌డే నిద్రిస్తున్నారు. లేక‌పోతే.. ఒక్కొక్క‌సారి అది కూడా లేదు. అంతా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల గురించే ఆలోచ‌న చేస్తున్నారు. నేరుగా త‌నే రంగంలోకి దిగిపోతున్నారు. అధికారుల‌ను అదిలిస్తున్నారు. తాను ప‌రుగులు పెడుతూ.. యంత్రాంగాన్ని ప‌రుగులు పెట్టిస్తున్నారు. కానీ.. ఈ క్ర‌మంలో కొందరు అధికారులు న‌త్త‌న‌డ‌క‌న వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది వాస్త‌వం. అలాంటి వారిని హెచ్చ‌రిస్తూ.. తాను మాత్రం ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌కుండా.. ముందుకే అన్న‌ట్టుగా సాగుతున్నారు.

చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలిని గ‌మ‌నిస్తే.. ఆయ‌న ఒంట‌రి పోరాటం చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. మిత్ర ప‌క్షాల్లో కేవ‌లం జ‌న‌సేన మాత్రమే ఒకింత యాక్టివ్‌గా ఉంది. బీజేపీ అసలు ముసుగుత‌న్నే సింది. త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్టుగానే నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలియ‌దు.. న‌లుగురు ఎంపీలు ఎక్క‌డున్నారో.. వారికే అర్ధం కాదు. అయిన‌ప్ప‌టికీ..చంద్ర‌బాబు త‌న పోరాటాన్ని ఎక్కడా వ‌దిలి పెట్ట‌లేదు.

బాధితుల‌కు ఆప‌న్న‌హ‌స్తం అందించేందుకు ముందుకు క‌దులుతూనే ఉన్నారు. ప్ర‌తి రెండు గంట‌ల‌కు ఒక‌సారి మీడియా ముందుకు వ‌స్తున్నారు. తానేంచేసిందీ చెబుతున్నారు. ఎక్క‌డెక్క‌డ తిరిగిందీ.. ఎంత మంది బాధితుల‌ను ఓదార్చింది కూడా చెబుతున్నారు. ఆహారం, తాగునీరు వంటివాటిని విరివిగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఇంత చేస్తున్నా.. క్షేత్ర‌స్థాయిలో యంత్రాంగంలో లోపించిన నిబ‌ద్ధ‌త కార‌ణంగా.. సరైన విధంగా ఆ సాయం ప్ర‌జ‌ల‌కు చేరడం లేద‌న్న‌ది వాస్త‌వం. కానీ, చంద్ర‌బాబు కృషిని మాత్రం అభినందించ‌కుండా ఉండ‌లేం.