వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులోనూ నేతలకు ముందస్తు బెయిలు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
ఈ కేసుల్లో మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగాం సురేష్, వైకాప నేత దేవినేని అవినాష్ తదితరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం వీరు హైకోర్టును ఆశ్రయించారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయం మీద, చంద్రబాబు నివాసం మీద వందలాది మంది దాడి చేశారు. ఈ దాడిలో విలువైన వస్తువులు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో బెయిలుకు కోర్టు నిరాకరించగా సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు అరెస్టు నుండి మినహాయింపు ఇవ్వాలని వైసీపీ నేతలు కోరారు. అరెస్టు నుండి మినహాయింపు ఇవ్వొద్దని టీడీపీ తరపు న్యాయవాదులు కోరగా హైకోర్టు మధ్యాహ్నం తీర్పు వెల్లడించనున్నది.
This post was last modified on September 4, 2024 2:44 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…