కృష్ణానది మహోగ్ర రూపం దాల్చడంతో ఏపీలోని ప్రముఖ వాణిజ్య ప్రాంతం విజయవాడ పూర్తిగా నీట మునిగింది. ఎక్కడా కూ డా.. వరద లేని ప్రాంతం కనిపించడం లేదంటే అతిశయోక్తికాదు. ముఖ్యంగా శివారు ప్రాంతాలైన సింగునగర్, నున్న.. పాయకా పురం, జక్కంపూడి వంటి ప్రాంతాలన్నీ నీటమునిగాయి.
దీంతో రెండు లక్షల మందికిపైగానే ప్రజలు నిరాశ్రయులయ్యారు. అంతే కాదు.. కొందరు కట్టుబట్టలతో మిగిలారు. ఈ నేపథ్యంలో వారి వరద కష్టాలను కొంతైనా తగ్గించాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు.
ఎన్నడూ ఏ ముఖ్యమంత్రీ స్వయంగా వరద నీటిలో పర్యటించకపోవడంతోపాటు.. కేవలం సమీక్షలకే పరిమితం అయ్యారు. అలాంటిది.. తాజాగా చంద్రబాబు మాత్రం.. నేరుగా రంగంలోకి దిగారు. స్వయంగా బాధితులను ఓదార్చారు. వారికి సాయం అందే వరకు నిద్ర పోనంటూ… ఆయన అధికారులకు తేల్చి చెప్పారు.
ఇక, దేవదేవుడే దిగి వచ్చిన తర్వాత.. క్షేత్రస్థాయిలో పర్యటన చేపట్టిన తర్వాత.. ఇతర అధికారులు.. ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిం చారు. ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా.. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా రంగంలోకి దిగింది.
ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అదినేత, విపక్ష నేత జగన్ కూడా.. రంగంలోకి దిగారు. చంద్రబాబే స్వయంగా బురదలోనూ.. వరదలోనూ పర్యటించినప్పుడు.. తాను తాడేపల్లి ప్యాలస్కే పరిమితం అయితే.. బాగోదనుకున్నారో.. లేక వరదలు, విపత్తులు వచ్చినప్పుడు.. ఇలా చేస్తారా? ఇలా చేయాలా? అని తెలుసుకున్నారో.. ఏమో మొత్తానికి జగన్ కూడా రంగంలోకి దిగారు.
అయితే.. అలా ఇలా కాదు.. నేరుగా మొకాల్లోతు నీటిలో దిగి బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. పార్టీ తరఫున ఆదుకుంటామని చెప్పారు. పనిలో పనిగా సర్కారు తీరుపై విమర్శలు చేసి.. తన డ్యూటీ పూర్తి చేశారు.
అయితే.. ఇక్కడ కీలక విషయం.. ఏంటంటే, జగన్ తన జీవిత కాలంలో ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. ఈ తరహాలో ఎప్పుడూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది కానీ.. మోకాల్లోతు నీటిలో ఎక్కడా ఆయన దిగిందికానీ లేకపోవడం గమనార్హం.
దీంతో ఆయన పనితీరులో మార్పు వచ్చిందా? లేక.. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆయన మారారా? లేక.. ఇవన్నీ కాకుండా.. చంద్రబాబు కొట్టేస్తున్న క్రెడిట్లో కొంతైనా తనకు రావాలని అనుకున్నారా? అనేది ఆసక్తిగా మారింది. ఏదేమైనా.. ఒక్క ఓటమి.. జగన్ను వరద నీటిలో ఈదేలా చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates