Political News

వరదలు వచ్చినపుడు బాబు వర్కింగ్ స్టైల్ మారిపోతుంది

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు తీరే వేరు. పార్టీ ప‌రంగా ఆయ‌న ఎలా ఉన్నా.. పాల‌నా ప‌రంగా మాత్రం ఖ‌చ్చితంగా ఆయ‌న సీఈవోను త‌ల‌పిస్తారు. ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని న‌డిపించ‌డంలోనూ.. పాల‌న‌ను ముందుకు తీసుకువెళ్లి ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించ‌డంలోనూ.. చంద్ర‌బాబుకు సాటి లేరంటే అతిశ‌యోక్తి లేదు. ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉన్నారంటే.. ఆయ‌న విల‌విల్లాడి పోతారు. అది వ‌ర‌దైనా.. విప‌త్త‌యినా.. ప్ర‌జ‌ల‌ను కాపాడుకునేందుకు శాయ‌శ‌క్తులా ఆయ‌న ప‌నిచేయ‌డ‌మే కాదు.. పాల‌నా యంత్రాంగాన్నిముందుండి న‌డిపిస్తారు. గ‌తంలో 2016లో వెల్లువెత్తిన హుద్ హుద్ తుఫాను స‌మ‌యంలోనూ ఆయ‌న త‌నేంటో నిరూపించారు.

నాటి విల‌యంలో విశాఖ చివురుటాకులా వ‌ణికిపోయింది. రుషికొండ ప‌ర్యాట‌క ప్రాంతం స‌హా.. ఆర్కే బీచ్ ప‌రిస‌ర ప్రాంతాలు.. ప్ర‌ధాన ర‌హ‌దారులు కూడా.. పెద్ద ఎత్తున దెబ్బ‌తిన్నాయి. దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణించిన చంద్ర‌బాబు ఆరోజు కూడా.. విశాఖ‌లోనే రేయింబ‌వ‌ళ్లు.. అక్క‌డే తిష్ట‌వేసి.. ప‌న్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించారు. అంతేకాదు.. హుద్‌హుద్ తుఫానుతో దెబ్బ‌తిన్న విశాఖ‌ను కేవ‌లం ఏడాది స‌మయంలోనే మ‌రింత సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు విజ‌య‌వాడ వంతు వ‌చ్చింది. బుడ‌మేరు వ‌ర‌ద ప్ర‌భావం కార‌ణంగా.. ఇక్క‌డ ప్ర‌జ‌లు నీట మునిగారు. ఇళ్లు.. ఒళ్లు.. అన్నీ వ‌ర‌ద‌లో క‌లిసిపోయాయి.

చంద్ర‌బాబు హుటాహుటిన స్పందించారు. తాను ప‌నిచేస్తూ.. త‌న పాల‌నా యంత్రాంగంతోనూ ఆయ‌న ప‌నిచేయించారు. అంతేకాదు.. అనుక్ష‌ణం ఆయ‌న ప్ర‌జ‌ల బాగోగుల‌ను ప‌రిశీలించారు. ఇవ‌న్నీ ప‌రిశీలించాక‌.. చంద్ర‌బాబులో దాగి ఉన్న సీఈవో మ‌రో సారి మేల్కొన్నార‌న్న‌చ‌ర్చ‌.. ఆయ‌న‌ను విమ‌ర్శించేవారి నోళ్ల‌కు తాళాలు ప‌డ్డాయ‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అంతేకాదు.. పార్టీలో కార్యకర్తల్ని పట్టించుకోవటం లేదన్న మూతిముడుపులు, కోపం వచ్చి అలిగే నాయ‌కులు.. కూడా ఇప్పుడు బాబును చూసి మెచ్చుకోకుండా ఉండ‌లేని ప‌రిస్థితి.

అంతేకాదు.. నీకు సపోర్ట్ చేసేదే లేదు అని బిగదీసుకున్న నాయ‌కులు.. నువ్వు మారవు… కొత్త చంద్రబాబుని చూసేది లేదు అని జోకులు వేసుకున్న వారు కూడా.. ఇప్పుడు ఆయ‌న పాల‌నా ప‌ట‌మచూసి.. జనాలు కష్టం లొ ఉన్నారంటే చేసే చాకిరి చూసి.. ఆయ‌న‌పై అభిమానం మ‌ళ్లీ పెంచుకుంటారు. చంద్ర‌బాబు అంటే.. ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతారు. అందుకే ద‌టీజ్ చంద్ర‌బాబు! ఆయ‌న తీరు.. పాల‌నా వైఖ‌రి వంటివి ఎప్ప‌టిక‌ప్పుడు.. ఒక‌రిని అనుకరించేది కాదు.. కొత్త‌గా నేర్చుకునేదే! అన‌డంలో సందేహం లేదు.

This post was last modified on September 2, 2024 4:38 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

రాష్ట్రం వెంటిలేట‌ర్ పై ఉంది: చంద్ర‌బాబు

రాష్ట్రం వెంటిలేట‌ర్‌పై ఉంద‌ని.. అయితే..దీనిని బ‌య‌ట‌కు తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా…

5 mins ago

లక్కీ మీనాక్షి కి మరో దెబ్బ

టాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి టాప్ త్రీలో ఉంది. హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే కాల్…

23 mins ago

జ‌గ‌న్ చేసిన ‘7’ అతి పెద్ద త‌ప్పులు ఇవే: చంద్ర‌బాబు

జ‌గ‌న్ హ‌యాంలో అనేక త‌ప్పులు జ‌రిగాయ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. అయితే.. మ‌రీ ముఖ్యంగా కొన్ని త‌ప్పుల కార‌ణంగా.. రాష్ట్రం…

44 mins ago

కంగువ నెగిటివిటీ…సీక్వెల్…నిర్మాత స్పందన !

సూర్య ప్యాన్ ఇండియా మూవీ కంగువాకు బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్పందన చూసి అభిమానులు సంతోషంగా లేరన్నది ఓపెన్ సీక్రెట్.…

1 hour ago

విజ్ఞుడైన ప‌ద్మ‌నాభం.. ప‌రువు పోతోంది.. గుర్తించారా?

కాపు ఉద్య‌మ మాజీ నాయ‌కుడు, వైసీపీ నేత ముద్రగ‌డ పద్మ‌నాభం.. చాలా రోజుల త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చారు. రాష్ట్రంలో…

3 hours ago

జగన్ లాగా టీచర్లతో బాత్రూమ్ పనులు చేయించం

వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…

3 hours ago