టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తీరే వేరు. పార్టీ పరంగా ఆయన ఎలా ఉన్నా.. పాలనా పరంగా మాత్రం ఖచ్చితంగా ఆయన సీఈవోను తలపిస్తారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించడంలోనూ.. పాలనను ముందుకు తీసుకువెళ్లి ప్రజలకు భరోసా కల్పించడంలోనూ.. చంద్రబాబుకు సాటి లేరంటే అతిశయోక్తి లేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే.. ఆయన విలవిల్లాడి పోతారు. అది వరదైనా.. విపత్తయినా.. ప్రజలను కాపాడుకునేందుకు శాయశక్తులా ఆయన పనిచేయడమే కాదు.. పాలనా యంత్రాంగాన్నిముందుండి నడిపిస్తారు. గతంలో 2016లో వెల్లువెత్తిన హుద్ హుద్ తుఫాను సమయంలోనూ ఆయన తనేంటో నిరూపించారు.
నాటి విలయంలో విశాఖ చివురుటాకులా వణికిపోయింది. రుషికొండ పర్యాటక ప్రాంతం సహా.. ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలు.. ప్రధాన రహదారులు కూడా.. పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు ఆరోజు కూడా.. విశాఖలోనే రేయింబవళ్లు.. అక్కడే తిష్టవేసి.. పన్రజలకు భరోసా కల్పించారు. అంతేకాదు.. హుద్‌హుద్ తుఫానుతో దెబ్బతిన్న విశాఖను కేవలం ఏడాది సమయంలోనే మరింత సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు విజయవాడ వంతు వచ్చింది. బుడమేరు వరద ప్రభావం కారణంగా.. ఇక్కడ ప్రజలు నీట మునిగారు. ఇళ్లు.. ఒళ్లు.. అన్నీ వరదలో కలిసిపోయాయి.
చంద్రబాబు హుటాహుటిన స్పందించారు. తాను పనిచేస్తూ.. తన పాలనా యంత్రాంగంతోనూ ఆయన పనిచేయించారు. అంతేకాదు.. అనుక్షణం ఆయన ప్రజల బాగోగులను పరిశీలించారు. ఇవన్నీ పరిశీలించాక.. చంద్రబాబులో దాగి ఉన్న సీఈవో మరో సారి మేల్కొన్నారన్నచర్చ.. ఆయనను విమర్శించేవారి నోళ్లకు తాళాలు పడ్డాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు.. పార్టీలో కార్యకర్తల్ని పట్టించుకోవటం లేదన్న మూతిముడుపులు, కోపం వచ్చి అలిగే నాయకులు.. కూడా ఇప్పుడు బాబును చూసి మెచ్చుకోకుండా ఉండలేని పరిస్థితి.
అంతేకాదు.. నీకు సపోర్ట్ చేసేదే లేదు అని బిగదీసుకున్న నాయకులు.. నువ్వు మారవు… కొత్త చంద్రబాబుని చూసేది లేదు అని జోకులు వేసుకున్న వారు కూడా.. ఇప్పుడు ఆయన పాలనా పటమచూసి.. జనాలు కష్టం లొ ఉన్నారంటే చేసే చాకిరి చూసి.. ఆయనపై అభిమానం మళ్లీ పెంచుకుంటారు. చంద్రబాబు అంటే.. ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధమవుతారు. అందుకే దటీజ్ చంద్రబాబు! ఆయన తీరు.. పాలనా వైఖరి వంటివి ఎప్పటికప్పుడు.. ఒకరిని అనుకరించేది కాదు.. కొత్తగా నేర్చుకునేదే! అనడంలో సందేహం లేదు.