తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తేశాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడ ప్రాంతాలు వరద ముప్పుతో అల్లాడిపోతున్నాయి. ఐతే వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో విజయవాడ మునిగిపోయింది.
ఇప్పుడు జీవించి ఉన్న వాళ్లలో ఎవ్వరూ కూడా తమ అనుభవంలో విజయవాడ ఇలా మునిగిపోవడం చూడలేదంటున్నారు. ఐతే ఇందుకు కారణాలేంటి అన్నది పక్కన పెడితే.. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, చేపడుతున్న సహాయ కార్యక్రమాలు ప్రశంసలు అందుకుంటున్నాయి.
ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గ్రౌండ్లోకి దిగి బాధితులకు మనో ధైర్యాన్నిస్తూ.. అధికారులను అప్రమత్త చేస్తూ సహాయ చర్యలు ఉత్తమ స్థాయిలో అందేలా చూస్తున్నారు. ఒక సీఎం బోటులో వీధుల వెంబడి ప్రయాణిస్తూ సహాయ చర్యలను పర్యవేక్షించడం.. అర్ధరాత్రి దాటాక మూడు గంటల ప్రాంతంలోనూ వరద ప్రాంతాల్లో పర్యటించడం అన్నది అరుదైన విషయం.
తెల్లవారుజాము వరకు మేలుకుని ఉండి సహాయ చర్యలను పర్యవేక్షించిన సీఎం మళ్లీ ఉదయానికల్లా వరద ప్రాంతాల్లోకి వచ్చేయడం విశేషం. ఈ సందర్భంగా గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఏం చేశారో గుర్తు చేసుకుంటున్నారు జనాలు.
సాధారణ వరదల సమయంలో అసలు బయటికే వచ్చేవారు కాదు జగన్. పరిస్థితి విషమిస్తే.. హెలికాఫ్టర్ ఎక్కి ఏరియల్ రివ్యూ చేసేవారు. ఇక తప్పదు గ్రౌండ్లోకి వెళ్లాలంటే.. అక్కడో సెటప్ ఏర్పాటు చేసుకుని ఎంపిక చేసిన జనాలు కొందరిని తీసుకొచ్చి పరామర్శించడం, వారితో జేజేలు కొట్టించుకోవడం లాంటి దృశ్యాలు జనం అంత సులువుగా మరిచిపోలేరు.
వరదలతో జనాలు అల్లాడిపోతుంటే సీఎం ఎక్కడ అని ఎవరైనా అంటే.. గ్రౌండ్లోకి సీఎం వస్తే భద్రత, ప్రొటోకాల్ పేరుతో వ్యవస్థ అంతా ఆయన చుట్టూ తిరుగుతుంది, సహాయ చర్యలకు అడ్డంకి అనేవాళ్లు. కానీ చంద్రబాబు ప్రొటోకాల్ హడావుడి ఎక్కువ లేకుండా గ్రౌండ్లో తిరుగుతూ.. వ్యవస్థను మరింత అప్రమత్తంగా ఉంచుతూ సహాయ చర్యలు పకడ్బందీగా జరిగేలా చూస్తుండడం ఇప్పుడు ప్రస్తావనార్హం. దీన్ని బట్టే మాజీ, ప్రస్తుత ముఖ్యమంత్రుల పనితీరులో ఎంత తేడా ఉందో స్పష్టంగా అర్థమైపోతుంది.
This post was last modified on September 2, 2024 2:13 pm
భూషణ్ కుమార్ అంటే మన ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాకపోవచ్చు కానీ ఆదిపురుష్, యానిమల్, స్పిరిట్ లాంటి భారీ ప్యాన్…
ఫిలిం ఇండస్ట్రీలో ప్రేమాయణాలు.. బ్రేకప్లు సర్వ సాధారణమే. ఐతే బాలీవుడ్లో ఈ ఒరవడి ఎక్కువ కాగా.. సౌత్ ఇండస్ట్రీల్లో కొంచెం…
మన దేశంలో చాలామంది ఆడవాళ్లు సాధారణంగా ఐదు పదుల వయసు తర్వాత ఏ టీవీ సీరియల్సో చూసుకుంటూ మనవళ్లతో ఆడుకుంటూ…
సుకుమార్ సినిమా అంటే ఐటెం సాంగ్ మాండేటరీ. ‘1 నేనొక్కడినే’ లాంటి సీరియస్ థ్రిల్లర్లో కూడా ఆయన ఐటెం సాంగ్…
టీడీపీ ఫైర్ బ్రాండ్లకు సీఎం చంద్రబాబు మరింత పెద్ద పీట వేశారు. వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంతో పాటు.. తాజాగా…
కనుమూరు రఘురామ కృష్ణంరాజు తెలుగు రాజకీయాల్లో ఎలాంటి సంచలనమో… ఎంత పాపులరో తెలిసిందే. మరీ ముఖ్యంగా గత ఐదేళ్లు వైసీపీ…