ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న… టీడీపీ అధినేత చంద్రబాబు అరుదైన రికార్డునే సొంతం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి.. సెప్టెంబరు 1 (ఆదివా రం)కి 30 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకునేందుకు తమ్ముళ్లు రెడీ అయ్యారు. ఇది అధికారికంగా కాకపోయినా.. ముఖ్యమంత్రిగా, పార్టీ పరంగా చంద్రబాబు సేవలను కొనియాడుతూ.. భారీ ఎత్తున కార్యక్రమాలు చేయాలని టీడీపీ నిర్ణయించింది.
1995, సెప్టెంబరు 1న చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆనాడు వరుసగా రెండో సారి టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే.. అన్నగారు ఎన్టీఆర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణ యం పార్టీలోనూ.. ఆయన కుటుంబంలోనూ చిచ్చు పెట్టింది. దీంతో అప్పట్లో చోటు చేసుకున్న రాజకీయ వివాదాలు.. మార్పులు.. సమీకరణల నేపథ్యంలో చంద్రబాబు వైపు మెజారిటీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపా రు. ఫలితంగా టీడీపీలో జరిగిన మార్పుతో .. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం వచ్చిన ఎన్నికల్లోనూ.. చంద్రబాబు ఘన విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత.. ఆయన విజన్-2020 పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. కేంద్రంలోని వాజపేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అప్పట్లో తీసుకువచ్చిన అనేక సంచలన కార్యక్రమాల్లోనే ఐటీ విప్లవం ఒకటి. జన్మభూమి, డ్వాక్రా సంఘాలు.. వంటివి కూడా అప్పట్లోనే ప్రజలకు పరిచయం అయ్యాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని.. చంద్రబాబు సేవలను గుర్తు చేస్తూ.. ఆదివారం పెద్ద ఎత్తున కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్న క్యాంటీన్లలోనూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. విరాళం ఇచ్చి.. చంద్రబాబు పేరుతో భోజనం వడ్డించనున్నారు. పార్టీ కార్యాలయాల్లో రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా పలు సేవాకార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. అయితే.. వాతావరణం సహకరించకపో తే.. ఈ కార్యక్రమాలను మరుసటి రోజు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
This post was last modified on September 1, 2024 1:22 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…