ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు హైదరాబాద్ హైడ్రా అధికారులు భారీ షాకిచ్చారు. ఆయన నివాసం ఉన్న లోటస్ పాండ్‌కు నోటీసులు జారీ చేశారు. మీరు కూలుస్తారా? మమ్మల్నే కూల్చమంటారా? చెప్పండంటూ.. ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఉదయాన్నే లోటస్ పాండ్ సిబ్బందికి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. లోటస్ పాండ్ అనేది.. చెరువు శిఖం ప్రాంతమని.. దీనిని ఆక్రమించి.. భారీ భవనం నిర్మించారని దానిలో పేర్కొన్నారు.
దీనిని తొలగించాలని హైడ్రా అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు. మరోవైపు.. మూడు రోజుల పర్యటన నిమిత్తం జగన్.. శనివారం మధ్యాహ్నం పులివెందులకు బయలు దేరుతున్న సమయంలో ఈ నోటీసులు రావడంతో ఆయన ఆలోచనలో పడ్డారు. హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న చెరువు శిఖంలో లోటస్ పాండ్ నిర్మించారన్నది.. హైడ్రా అధికారులు చెబుతున్నారు. గతంలోనూ.. రెండు నెలల కిందట లోటస్ పాండ్‌ను ఆనుకుని నిర్మించిన కొన్ని నిర్మాణాలను తొలగించారు.
అయితే.. వాటిని సెక్యూరిటీ కోసం.. అనధికారికంగా నిర్మించారని.. ఆ విషయం తమకు తెలియదని లోటస్ పాండ్ వర్గాలు అప్పట్లో పేర్కొన్నాయి. ఆ తర్వాత.. సీఎం రేవంత్ జోక్యంతో నిర్మాణాల కూల్చివేత ఆగిపోయింది. అప్పట్లో ఇలా చేసిన అధికారులకు హైదరాబాద్ మహానగర కార్పరేషన్ అధికారులకు సైతం నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. ఆతర్వాత హైడ్రా ఏర్పాటు అయింది. ఈ క్రమంలో అనేక నిర్మాణాలను కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా జగన్ నివాసానికి నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. దీనిలోనే మరోవైపు.. షర్మిల నివసిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on August 31, 2024 6:48 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…