Political News

ఎవ‌రున్నా వ‌ద‌లద్దు.. ప్ర‌తి 3 గంట‌ల‌కూ రిపోర్టు ఇవ్వండి: చంద్ర‌బాబు

కృష్ణా జిల్లా గుడ్లవ‌ల్లేరులోని శేషాద్రి ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో విద్యార్థినుల మ‌రుగు దొడ్ల‌లో హిడెన్ కెమెరాలు పెట్టి.. రికార్డు చేశా ర‌న్న తీవ్ర ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో విద్యార్థినులు ఆందోళ‌న‌కు దిగారు. ఈ విష‌యంపై హుటాహుటిన స్పందించిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌తి 3 గంట‌ల‌కు ఒక‌సారి మాట్లాడుతున్నారు. ఈ ఘ‌ట‌న వెనుక ఎవరున్నా.. వ‌దిలి పెట్ట‌రాదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

శుక్ర‌వారం ఉదయం 11గంట‌ల స‌మ‌యంలో ఘటన విషయం తెలిసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆ వెంటనే స్పందించిన చంద్ర‌బాబు జిల్లా అధికారులను అప్ర‌మ‌త్తం చేశారు. ఇదేస‌మ‌యంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్రను ఘ‌ట‌నా స్థ‌లానికి పంపించారు.

ఆ త‌ర్వాత‌.. ప్ర‌తి మూడు గంట‌ల‌కు చంద్ర‌బాబు అక్క‌డి ఘ‌ట‌న‌ల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడి విచారణ సాగుతున్న విధానంపైనా అడిగి తెలుసుకుంటున్నారు. క‌ళాశాల‌ విద్యార్థినుల ఆందోళనను, ఆవేదనను అర్థం చేసుకున్నాన‌ని, వారి ఆవేద‌న‌ను మీరు కూడా వినాల‌ని ఆయ‌న కోరారు.

అదేవిధంగా ఈ కేసుపై పటిష్ట దర్యాప్తు సాగించాల‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. హిడెన్ కెమెరాల ద్వారా వీడియోల చిత్రీకరణ జరిగిందన్న నేరం నిజ‌మైతే.. దాని వెనుక ఎంతటి కార‌కులు ఉన్నా.. క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, ఎవ‌రినీ వ‌దిలి పెట్ట‌రాద‌ని కూడా చంద్ర‌బాబు ఆదేశించారు.

“మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో…అంతే సీరియస్ గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలి. ఆందోళనలో ఉన్న వారికి భరోసా కల్పించాలి. విద్యార్థినుల విష‌యంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేసి ఉంటే.. దానిపైనా విచారణ జరపాలి. త‌క్ష‌ణం చర్యలు తీసుకోవాలి” అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

ఇక‌, త‌మ మ‌రుగు దొడ్ల‌లో కెమెరాలు పెట్టార‌ని ఆరోపిస్తున్న‌ విద్యార్థినుల వద్ద ఏ చిన్న క్లూ ఉన్నా.. వెంట‌నే త‌న‌కు నేరుగా పంపించాల‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని అధికారులే విద్యార్థినుల‌కు చెప్పాల‌న్నారు. ప్రభుత్వం ఖ‌చ్చితంగా చర్యలు తీసుకుంటుందన్న భ‌రోసా వారికి చేరేలా క‌లెక్ట‌ర్‌, ఎస్పీలు బాధ్య‌త తీసుకోవాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు. ప్రతి మూడు గంటలకు ఒక సారి తనకు ఏం చేశారో.. ఎలాంటి విష‌యాలు వెలుగు చూశాయో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు.

వైసీపీ ఫైర్‌

గుడ్ల‌వ‌ల్లేరు ఘ‌ట‌నపై వైసీపీ మ‌హిళా విభాగం విమ‌ర్శ‌లు గుప్పించింది. “ఇది 300 మంది ఆడపిల్లల భవిష్యత్తు.. హాస్టల్ వాష్ రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఆ ఫుటేజ్ లను బయటకు వదులుతున్నారు. అంటే రాష్ట్రంలో ఎంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయో అర్థమవుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయ వేధింపుల మీద దృష్టి పెట్టింది గానీ.. ఆడపిల్లల మాన ప్రాణాలు గురించి పట్టించుకోవట్లేదు. కూటమి నాయకులు, మంత్రులు ప్రశాంతంగా నిద్రపోతున్నారు తప్ప రాష్ట్రంలో ఏ ఆడపిల్ల కూడా ప్రశాంతంగా నిద్రపోవట్లేదు” అని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి వ్యాఖ్యానించారు.

This post was last modified on August 30, 2024 6:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టాలీవుడ్ ముందు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…

57 minutes ago

మార్కెటింగ్ గిమ్మిక్కులు పని చేయలేదా?

జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…

1 hour ago

‘స‌గం’ మీరూ పంచుకోండి.. మోడీకి చంద్ర‌బాబు విన్నపం!

కేంద్రంలోని ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీల మ‌ధ్య కొన్ని…

2 hours ago

మళ్లీ ‘సింపతీ’ని నమ్ముకున్న జగన్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…

2 hours ago

బాబుతో పాటు ‘ఈ బ్రాండూ’ పెరుగుతోంది!

సీఎం చంద్ర‌బాబు .. రాజ‌ధాని అమ‌రావ‌తికి బ్రాండ్ అని అంద‌రూ అనుకుంటారు. కానీ, ఆయ‌న అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగ‌ల‌రని…

3 hours ago

కష్టపడి దర్శకత్వం చేస్తే ఫలితం దక్కిందా?

హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం…

3 hours ago