ఏపీలో సలహాదారులు కొత్తకాదు. గతంలో చంద్రబాబు హయాంలోనూ.. అనేక శాఖలకు సలహాదారులు ఉన్నారు. అయితే.. వైసీపీ హయాంలో మాత్రం లెక్కకు మించి ప్రతి ఒక్కరికీ సలహాదారులను నియమిం చారు. ఇది వివాదానికి దారితీసింది. ఏకంగా హైకోర్టు వరకు కూడా వెళ్లింది. ముఖ్యంగా ప్రభుత్వ సలహాదా రుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ మరిన్ని వివాదాలు ముసురుకున్నాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో హైకోర్టు సీరియస్‌గానే రియాక్ట్ అయింది.
ఇక, అప్పటి సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు కూటమి సర్కారు కొలువుదీరిన తర్వాత కూడా సలహాదారుల నియామకాలు ప్రారంభం అయ్యాయి. అయితే.. వైసీపీ హయాంలో గుడ్డిగా జరిగిన నియామకాల మాదిరిగా కాకుండా.. ఆచి తూచి చంద్రబాబు నియామకాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో తొలి సలహాదారును నియమించారు. రాష్ట్ర జలవనరుల శాఖలోని మెకానికల్ విభాగం సలహాదారుగా కన్నయ్య నాయుడిని నియమిస్తూ.. చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
బ్యారేజీలకు గేట్లు నిర్మించడంలోనూ.. మెకానికల్ అంశాల్లోనూ కన్నయ్య నాయుడికి 40 ఏళ్లకుపైగానే అనుభవం ఉంది. దేశంలోని పలు కీలక ప్రాజెక్టులకు ఆయన గేట్లు అమర్చారు. ఇటీవల తుంగ భద్ర నదిపై ఉన్న బ్యారేజీకి 60 అడుగుల గేటు వరదల కారణంగా కొట్టుకుపోయింది. ఈ క్రమంలో ఆయన జల నష్టం నివారించేలా.. అంత భారీ వరదలోనూ గేటును ఏర్పాటు చేసి.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు. ఇప్పుడు ఆయననే చంద్రబాబు జలవనరుల శాఖలోని మెకానికల్ విభాగం సలహాదారుగా నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates