“పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా?”.. “ఇంక, ఆయన సినిమాల్లో నటించరా?”- ఇదీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉవ్వెత్తున సాగుతున్న పెద్ద చర్చ. అనేక మంది ఇన్ స్టా గ్రామ్‌లలో కూడా ఇదే ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే.. ఇంత పెద్ద చర్చ రావడానికి కారణం.. ఏంటి? ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు పవన్ చుట్టూ.. సినిమాలు చేయరు అని కామెంట్లు వినిపించడానికి రీజనేంటి? అనేది ఆసక్తిగా మారింది. దీనికి ప్రధానంగా రెండు రీజన్లు కనిపిస్తున్నాయి.
1) పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. 2) గత నాలుగు మాసాలుగా ఆయన ఇండస్ట్రీ మొహం కూడా చూడక పోవడం. మొదటి విషయానికి వస్తే.. తాజాగా పవన్ కళ్యాణ్.. ఓ గ్రామ సభలో మాట్లాడుతూ.. “ప్రజల కోసం నేను కూలీగా మారతా. సినిమాలు ముఖ్యం కాదు.. సమాజమే ముఖ్యం. ఇంకా చెప్పాలంటే.. సినిమాల కంటే కూడా దేశం ముఖ్యం. అందుకోసమే నేను కొన్ని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాను” అని వ్యాఖ్యానించారు. అయితే.. ఇక్కడ ఆయన నేరుగా తానుసినిమాలు మానేశానని ఎక్కడా చెప్పలేదు.
కానీ, ఈ వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్‌లలో అయితే.. పవన్ ఇక సినిమాలు చేయరా? గుడ్ బై చెప్పారా? అనే సందేహాలతో కూడిన చర్చలు జరుగుతున్నాయి. దీనికి సమాధానాలు మాత్రం పర్ ఫెక్ట్‌గా అయితే ఎవరూ చెప్పడం లేదు. ఇక, రెండో విషయాన్ని చూస్తే.. ఎన్నికలకు ముందు అంటే.. మార్చి నుంచి కూడా.. పవన్ కల్యాణ్ ప్రజల మధ్యే ఉన్నారు. వారాహి యాత్రలు.. ఇతరత్రా ఎన్నికల ప్రచారంతో గడిపారు.
ఎన్నికలు ముగిసి.. కూటమి సర్కారు వచ్చాక ఆయన డిప్యూటీ సీఎంగా బాద్యతలు చేపట్టారు. దీంతో అప్పటి నుంచి బిజీబిజీగా గడుపుతున్నారు. పిఠాపురంలో పర్యటించడం.. కార్యాలయాల్లో సమీక్షలు చేయడం, అసెంబ్లీకి హాజరు కావడం.. కేబినెట్ సమావేశాలకు వెళ్తుండడం.. మధ్యలో పార్టీ కార్యక్రమాలు చూడడం, మరోవైపు.. ప్రజావాణి పేరుతో నిర్వహిస్తున్న ప్రజల సమస్యలను తెలుసుకోవడంతోనే సరిపెడుతున్నారు. కనీసం హైదరాబాద్‌కు కూడా ఆయన వెళ్లిన సందర్భాలు చాలా వరకు తక్కువే. దీంతో ఇండస్ట్రీ అంతా ఆయన కోసం వేచిచూస్తోంది. కానీ, పవన్ మాత్రం ఎక్కడా ఆ ఊసెత్తకపోగా.. ఇప్పుడు ఈ కామెంట్లు చేయడంతో అందరిలోనూ పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్టేనా ? అనే చర్చ జోరుగా సాగుతోంది.
This post was last modified on August 24, 2024 2:31 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…