అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. విపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించే తీరు చంద్రబాబులో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన తీరు ఇప్పటికి మారలేదన్న విషయం తాజా పరిణామాలు మరోసారి స్పష్టం చేస్తున్న పరిస్థితి.
తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని గడ్డు పరిస్థితుల్ని చూసినట్లుగా.. వాటిని ఎదుర్కొన్నట్లుగా చంద్రబాబు తన సన్నిహితులతో చెబుతుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గడిచిన ఐదేళ్లలో చోటు చేసుకున్న అంశాల్ని ప్రస్తావించటమే కాదు.. తన కెరీర్ లో చూడనంత విధ్వంసాన్ని తాను చూసినట్లు చెబుతారు.
ఆయన నోటి నుంచి వచ్చే మాటలు ఆయన మనసులో నుంచి రావట్లేదా? ఒకవేళ వస్తే.. అలాంటి పరిస్థితుల గురించి వెరో అలెర్టు చేయకుండానే సరి చేయాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంది కదా? అన్నది ప్రశ్న.
ఎందుకిదంతా అంటే.. వైసీపీ నేత.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాదాపు వంద కోట్ల రూపాయిల విలువైన 982.48 ఎకరాల భూమిని ప్రైవేటు పట్టా భూములుగా మార్చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి తాజాగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం సైతం ఈ దారుణం చోటు చేసుకుందని తేల్చింది.
విజిలెన్స్ సిద్ధం చేసిన ప్రాథమిక రిపోర్టులో ఒక సంచలన అంశాన్ని ప్రస్తావించారు. అదేమంటే.. అప్పటి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్.. ప్రస్తుత తిరుపతి కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ కుట్రకు పాల్పడినట్లుగా నిగ్గు దేల్చటం సంచలనంగా మారింది.
ఇదంతా చూసినోళ్లు.. ముక్కున వేలేసుకుంటున్నారు. కారణం.. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు తాను ప్రాతినిధ్యం వహించే జిల్లాకు సంబంధించిన కీలక అధికారి ఎంపిక ఎలా ఉండాలి? ఏ ప్రాతిపదికన చేపట్టాలన్న చిన్న విషయాల్ని మర్చిపోవటం చూస్తే.. ఇదేంది చంద్రబాబు.. ఈ ప్లానింగ్ ఏమిటి? అన్న ప్రశ్నలు రాక మానవు.
గత ప్రభుత్వానికి.. ప్రభుత్వంలోని కీలక నేతల అడుగులకు మడుగులు పట్టిన వారి గురించి చంద్రబాబుకు ప్రత్యేకంగా ఫీడ్ బ్యాక్ ఉండి ఉంటుంది. ఎందుకుంటే.. విపక్ష నేతగా ఉన్నప్పుడు తమను, తమ పార్టీని.. నేతల్ని టార్గెట్ చేసిన వారి వివరాల్ని సేకరించటం.. తాము అధికారంలోకి రాగానే అలాంట వారి సంగతి చూస్తామన్న హెచ్చరికలు చేశారు.
ఇంత జరిగి.. అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేతకు ఇంత భారీగా భూమిని కట్టబెట్టే వైనం చంద్రబాబుకు కానీ వారి పరివారానికి కానీ తెలీకుండా ఉంటుందా? అన్నది మరో ప్రశ్న. విజిలెన్స్ రిపోర్టు వెలుగు చూసి.. మీడియాలో వచ్చే వరకు చంద్రబాబు ఏం చేస్తున్నట్లు?
తన రాజకీయ ప్రత్యర్థి వ్యూహాలపై కూడా అవగాహన లేకపోవటాన్ని ఎలా చూడాలి? అన్న వాదన వినిపిస్తోంది. తాజా రిపోర్టు ప్రకారం బాధ్యులైన పెద్దిరెడ్డి.. తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్.. పలమనేరు ఆర్డీవోలుగా పని చేసిన పులి శ్రీనివాసులు.. మనోజ్ కుమార్ రెడ్డి.. నాటి పలమనేరు తహసీల్దార్ సీతారామ్ లు లబ్థి పొందినట్లుగా పేర్కొన్నారు.
వీరంతా కుమ్మక్కైనట్లుగా విజిలెన్స్ రిపోర్టు పేర్కొంది. నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడి ప్రభుత్వ భూముల మ్యుటేషన్ లో అక్రమాలు చేసినట్లుగా నిర్దారించింది. వీరందరిపై భూకబ్జా చట్టాల్లోని అక్రమ చొరబాటు.. మోసం.. ఫోర్జరీ తదితర సెక్షన్ కింద చర్యలు తీసుకోవాలని చెప్పింది.
అధికారంలోకి వచ్చినంతనే ప్రతీకార చర్యలు తీసుకోవాలి లాంటి మాటలు చెప్పట్లేదు కానీ.. కనీసం తప్పుడు తీరుతో వ్యవహరించినట్లుగా ఆరోపణలు ఉన్న వారిని పక్కన పెట్టేయాలన్న అంశంపై కూడా కసరత్తు జరగకపోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న.
అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్పిన చంద్రబాబు పవర్లోకి వచ్చిన తర్వాత ఏమేమో చేయక్కర్లేదు కానీ.. తన సొంత జిల్లాకు ఏర్పాటు చేసిన కలెక్టర్ బ్యాక్ గ్రౌండ్ గురించి ఎందుకని క్రాస్ చెక్ చేయలేదన్నదే అసలు ప్రశ్న. దీనికి సమాధానం చెప్పేదెవరు?
This post was last modified on August 24, 2024 10:28 am
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది.…