Political News

వైసీపీకి బిగ్ రిలీఫ్‌.. ఒకేరోజు ఇద్ద‌రికి బెయిల్

ప్ర‌తిప‌క్ష వైసీపీకి ఒకే రోజు రెండు విష‌యాల్లో భారీ ఉప‌శ‌మ‌నం ల‌భించింది. ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల‌కు సంబంధించిన కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో వైసీపీ నేత‌లు ఒకింత ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. దీనిలోనూ ప్ర‌ధానంగా ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యంలో మే 13న ఈవీఎం స‌హా వీవీ ప్యాట్‌ను ధ్వంసం చేసిన కేసులో జైల్లో ఉన్న పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో పోలింగ్ జ‌రిగిన స‌మ‌యంలో పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లోకి ప్ర‌వేశించిన పిన్నెల్లి.. ఈవీఎం, వీవీ ప్యాట్‌ల‌ను ధ్వంసం చేసిన వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.

ఈ కేసులో 40 రోజుల‌కు పైగానే పిన్నెల్లి నెల్లూరులోని సెంట్ర‌ల్ జైలులో ఉన్నారు. బెయిల్ కోరుతూ..ప‌లు ద‌ఫాలుగా గుర‌జాల కోర్టునుఆ శ్ర‌యించారు. అయితే.. అక్క‌డ ఆయ‌న‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించ‌లేదు. తాజాగా హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. అయితే.. ష‌ర‌తులతో కూడిన బెయిల్ మంజూరు కావ‌డం గ‌మ‌నార్హం. దీనికి సంబంధించి రూ.50000 చొప్పున రెండు గ్యారెంటీను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. దీంతో శ‌నివారం ఆయ‌న విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

ఇవీ ష‌ర‌తులు

  • వారానికి ఒక‌సారి పోలీసు స్టేష‌న్‌కు హాజ‌రై.. సంత‌కం చేయాలి.
  • పాస్ పోర్టును క‌లెక్ట‌ర్‌కు స్వాధీనం చేయాలి
  • కేసుకు సంబందించిన విష‌యాల‌ను మీడియా ముందు మాట్లాడ‌డానికి వీల్లేదు.
  • సాక్షుల‌ను బెదిరించ‌వ‌ద్దు.. ప్ర‌లోభాల‌కు గురిచేయ‌వ‌ద్దు.
  • పోలీసుల‌కు.. నివాసం, ఫోన్ నెంబ‌రు వివ‌రాల‌ను అంద‌జేయాలి.
  • ష‌ర‌తులు ఉల్లంఘిస్తే.. ఎప్పుడైనా బెయిల్ ర‌ద్దు అవుతుంది.

జోగి కుమారుడికి బెయిల్‌

మాజీ మంత్రి జోగి ర‌మేష్ కుమారుడు జోగి రాజీవ్‌కు కూడా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ భూముల‌ను అక్ర‌మంగా స్వాధీనం చేసుకుని వేరే వారికి విక్ర‌యించారంటూ.. ఏసీబీ అధికారులు న‌మోదు చేసిన కేసులో రాజీవ్ వారం కిందట అరెస్ట‌యిన విష‌యం తెలిసిందే. దీంతో స్థానిక కోర్టు ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా ఈ కేసులోనూ స్వ‌ల్ప ష‌ర‌తుల‌తో రాజీవ్‌కు బెయిల్ మంజూరైంది. ఆయ‌న‌ను జిల్లా దాటి వెళ్లేందుకు వీల్లేద‌ని, కోరిన‌ప్పుడు విచార‌ణ‌కు రావాల‌ని కోర్టు నిర్దేశించింది. దీంతో వైసీపీకి ఒకింత ఊర‌ట ల‌భించిన‌ట్టు అయింది.

This post was last modified on August 23, 2024 9:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కాంగ్రెస్ ఒంట‌రి.. రాహుల్ స‌క్సెస్‌పై ఎఫెక్ట్‌!

జాతీయ‌స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి ఒంట‌రి ప్ర‌యాణాన్ని త‌ప్పించుకునేలా క‌నిపించ‌డం లేదు. ఏడాదిన్న‌ర కింద‌టి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగానే…

44 minutes ago

పిఠాపురంలో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌… రీజ‌నేంటి?

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలో ఆక‌స్మికం గా ప‌ర్య‌టించారు. వాస్త‌వానికి…

1 hour ago

టీటీడీ చైర్మన్, ఈవో కూడా సారీ చెప్పాలన్న పవన్

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది.…

2 hours ago

అంతా మీ ఇష్ట‌మేనా? బెనిఫిట్ షోలు ఆపండి: టీ హైకోర్టు

బెనిఫిట్ షోలు, ప్రీమియ‌ర్ షోల విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు భిన్న‌మైన ఆదేశాలు ఇవ్వ‌డం ఆస‌క్తిగా మారింది. ఏపీలో…

2 hours ago

స్వలింగ వివాహాలపై సుప్రీం సంచలన తీర్పు!

స్వలింగ వివాహాలకు చట్టబద్ధతకు నో.. తేల్చేసిన సుప్రీంస్వలింగ వివాహాలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై దాఖలైన పిటిషన్లపై కీలక…

2 hours ago