ఏపీలోని అతి పెద్ద పరిశ్రమల్లో కేవలం ఐదేళ్ల వ్యవధిలో రెండు అతి పెద్ద దుర్ఘటనలు జరిగాయి. 2020 ప్రారంభంలో విశాఖపట్నంలోని ఎల్ జీ పాలిమర్స్ నుంచి వెలువడిన ప్రాణాంతక వాయువు కారణంగా.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆనాడు కూడా.. బాధితుల వ్యవహారం రాజకీయం అయింది. ఇక, అప్పటి కేసు ఇప్పటి వరకు తేలకపోగా.. బాధ్యులైన ఎల్ జీ కంపెనీ ప్రతినిధులు.. రాష్ట్రం విడిచి వెళ్లిపోయారు.
ఇక, ఇప్పుడు అదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో జరిగిన ఘోరం.. మరో రాజకీయ దుమారాన్నిరేపింది. ఇప్పటి వరకు సంబంధిత ఎసెన్షియా కంపెనీ ప్రతినిధులు కానీ, బాధ్యులు కానీ.. ఎవరూ స్పందించలేదు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్.. ఎల్ జీ బాధితులను పరామర్శించి.. రూ.కోటి పరిహారం ప్రకటించినట్టుగానే ఇప్పుడు కూడా.. చంద్రబాబు రూ.కోటి పరిహారం ప్రకటించారు. ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు.
ఇక్కడితే సర్కారు పని అయిపోయినట్టే!. రేపటి నుంచి ఇతర విషయాలు.. సర్కారు చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయి. అయితే.. ఇక్కడే అసలు కీలక విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. పరిశ్ర మల విషయంలో జరుగుతున్న రాజకీయాలను ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. కంపెనీ యాజమాన్యం మధ్య విభేదాలు ఉన్నట్లు తమకు తెలిసిందన్నారు. అందిన సమాచారం మేరకే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని అన్నారు. ఇదే సమయంలో మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. “సేఫ్టీ ఆడిట్ చేయమని తాను ముందు నుంచి చెబుతున్నా. అయితే కంపెనీలు వెనక్కు వెళతాయయోనని ఆందోళన చెందుతున్నారు” అని అన్నారు.
పవన్ చెప్పిన విషయంలో రెండో వ్యాఖ్య అత్యంత కీలకం. కంపెనీలు తీసుకురావడంలో ఏర్పడిన పోటీ.. అనేక విషయాల్లో ప్రభుత్వాలు రాజీ పడేలా మారిపోయింది. “మీరు కాదంటే.. పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోతాం” అంటూ.. కంపెనీలు బెదిరించే స్థాయి వచ్చింది. పోనీ.. పోతే పోండి! అని ఊరుకుంటే.. రాజకీయం గా ప్రభుత్వాలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. దీంతో ప్రజల రక్షణ, కార్మికుల భద్రత కూడా.. గాలిలో కలిసిపోతోంది. కంపెనీల భద్రతకు సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వానికి ఆయా కంపెనీలు నివేదికలు ఇవ్వాలి. ఇది నిబంధన.
అదేసమయంలో ప్రభుత్వం నుంచి కూడా ఆయా సేఫ్టీ అంశాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి. కానీ, ఇవేవీ జరగడం లేదు. ఏమంటే.. ఏం జరుగుతుందో అన్న భయం ప్రభుత్వాలకు, సర్కారు తమను టార్గెట్ చేస్తే.. వెళ్లిపోతామన్న కొరడా ఝళిపించేలా.. పరిశ్రమలు ఉన్న కారణంగానే.. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందనేది పవన్ కల్యాణ్ చెప్పకనే చెప్పారు. కాబట్టి ఇప్పుడు సర్కారు చేయాల్సింది.. రాజకీయం కాదు.. నిర్దిష్ట నిబంధనలు పాటించేలా పరిశ్రమలను ఒప్పించడం.. లేదా చర్యలు తీసుకోవడం. లేకపోతే.. పరిశ్రమల దూకుడు ముందు.. ప్రజల ప్రాణాలు ఇలానే బలవుతాయి.
This post was last modified on August 23, 2024 3:18 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…