వైసీపీ కీలక నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు ఆ పార్టీ అధినేత జగన్ సింపుల్‌గా షాకి చ్చారు. పార్టీలో ఫైర్ బ్రాండ్ కావడంతో నొప్పి తెలియకుండా.. చిన్నవాత పెట్టి.. పెద్ద ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దువ్వాడ కుటుంబ వ్యవహారం కారణంగా రోడ్డున పడ్డ విషయం తెలిసిందే.
భార్య, ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్న దువ్వాడ.. వేరే మహిళతో ఉంటున్నారనే విషయం వెలుగు చూసింది. ఇది వారి వ్యక్తిగత విషయం అనేందుకు అవకాశం లేకుండా కూడా పోయింది.
ఎందుకంటే తమకు న్యాయం చేయాలని సాక్షాత్తూ దువ్వాడ సతీమణి వాణి.. ఆయన బిడ్డులు కూడా రోడ్డె క్కారు. ధర్నాలు, నిరసనలు.. దాడులు ఇలా.. అన్నీ జరిగిపోయాయి. చివరకు వ్యవహారం.. మీడియాలో ప్రధాన వార్తలు హైలెట్ అయ్యాయి.
ఇక్కడ భార్య డిమాండ్ ఏంటంటే.. వైసీపీలో ఉండబట్టి ఎమ్మెల్సీగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమపై దాడులు చేస్తున్నారని.. కాబట్టి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వాణి కోరుతున్నారు. లేదా ఎమ్మెల్సీ పదవి నుంచి అయినా తప్పించాలని.
కానీ, నిన్న మొన్నటి వరకు కూడా జగన్ ఈ విషయంలో స్పందించలేదు. దువ్వాడ వ్యవహారం తారస్థా యికి చేరిన తర్వాత కూడా ఆయన మౌనంగానే ఉన్నారు. కానీ, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మాత్రం దువ్వాడ కారణంగా డ్యామేజీ పెరుగుతోందని.. ఇలా అయితే.. ఇబ్బందేనని సీనియర్ నాయకులు లిఖిత పూర్వకంగా జగన్‌కు సూచించినట్టు తెలిసింది. దీంతో ఇక, తప్పని పరిస్థితిలో దువ్వాడపై చర్యలకు మొగ్గు చూపుతూ… సింపుట్ యాక్షన్ తీసుకున్నారు.
ప్రస్తుతం టెక్కలి నియోజకవర్గం ఇంచార్జ్‌గా ఉన్న దువ్వాడను ఆ స్థానం నుంచి తప్పించారు. దీనిని పేరాడ తిలక్‌కు ఇచ్చారు. అయితే.. ఇక్కడే వ్యూహం ఉంది. ఇలా చేయడం వల్ల దువ్వాడపై పాలు పోసినట్టు అయింది. నియోజకవర్గం బాధ్యత నుంచి తప్పించడంతో బిగ్ రిలీఫ్ వచ్చింది.
పైగా.. చర్యలు తీసుకున్నట్టుగా కూడా ఉంది. మరోవైపు.. తీవ్ర అసంతృప్తితో ఉన్నపేరాడ తిలక్‌కు ఇంచార్జ్ పోస్టు ఇచ్చినట్టు కూడా అయింది. అయితే.. ఇక్కడ వాణి డిమాండ్ మాత్రం నెరవేరకపోవడం.. ఆమె ఆవేదనను జగన్ పట్టించుకోకపోవడం గమనార్హం.
This post was last modified on August 23, 2024 12:02 pm
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…
తెలుగులో ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. పాన్ వరల్డ్ హిట్…