Political News

నేడు గ్రామ స‌భ‌లు.. ప‌వ‌న్ మార్కు ప‌డుతుందా?

ఏపీలో శుక్ర‌వారం ఒక్క‌రోజే గ్రామ స‌భ‌లు నిర్వ‌హించ‌నున్నారు. వాస్త‌వానికి వారం రోజుల పాటు గ్రామ స‌భ లు నిర్వ‌హించాల‌ని ముందుగానే అనుకున్నారు. కానీ, కొన్ని కార‌ణాల‌తో స‌భ‌ల‌ను ఒక్క‌రోజుకే ప‌రిమితం చేశారు. పంచాయ‌తీరాజ్ శాఖ ప‌రిధిలో జ‌రిగే ఈ స‌భ‌ల వెనుక డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ముద్ర ఉంది. ఆయ‌న ఏరికోరి ఈ స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. వాస్త‌వానికి సుమారు 10 ఏళ్ల కింద‌ట మాత్ర‌మే గ్రామ స‌భ‌లు నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత‌.. వాటి జాడ ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

దీనికి కార‌ణం.. గ్రామీణ ప్రాంతాల్లో స‌మ‌స్య‌ల‌కు, రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితికి-కేంద్ర ప‌థ‌కాల‌కు మ‌ధ్య సంబంధం ఉండ‌డ‌మే. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధుల్లో కొంత త‌మ వాటా కూడా క‌లిపి రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఖ‌ర్చు చేయాలి. కానీ, గ‌త కొన్నేళ్లుగా ఇలా చేయ‌డం లేదు. పైగా.. గ్రామీణ అభివృద్దికి ఇచ్చిన సొమ్మును కూడా.. వివిధ రూపాల్లో వేరే కార్య‌క్ర‌మాల‌కు ఖ‌ర్చు చేస్తున్నారు. ఇదే విష‌యాన్ని తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పుకొచ్చారు.

“గ్రామాల‌కు మ‌నం ఇవ్వాల్సింది పోయి.. మ‌న‌మే వారి సొమ్మును లాగేసుకుంటున్నాం. ఇది చాలా దారుణం” అని వ్యాఖ్యానించారు. అయితే.. ఇక్క‌డ ప‌వ‌న్ ఆవేద‌న‌లో వాస్త‌వం ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలోకి వ‌చ్చే సరికి.. మాత్రం దీనిని స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నంలో ఏ ప్ర‌భుత్వ‌మూ లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఇలానే ఉంది. ఇప్పుడు.. దీనిని స‌రిదిద్ది.. కేంద్రం నుంచి వ‌చ్చే గ్రాంట్ల‌ను నేరుగా గ్రామాల‌కు ఇచ్చేయాల‌న్న‌ది ప‌వ‌న్ సూచ‌న‌. దీనికి రాష్ట్ర వాటా కూడా క‌ల‌పాల‌న్న‌ది ఆయ‌న భావ‌న‌.

కానీ, ఈ రెండు చేయ‌డం అంత ఈజీకాదు. పోనీ.. రెండోది చేయ‌లేక‌పోయినా.. మొద‌టిది అయినా.. చేస్తారా? అంటే.. దీనికి ఎంతో కృత నిశ్చ‌యం కావాలి. ఎందుకంటే.. ప్ర‌భుత్వాలు త‌మ శ‌క్తికి మించిన భారాల‌ను నెత్తిన పెట్టుకున్న‌ప్పుడు.. ఎటు నుంచి నిధులు వ‌చ్చినా.. వాడేయ‌డం త‌ప్ప‌.. నిర్దేశిత కార్య‌క్ర‌మానికి ఇవ్వాల‌న్న ప‌రిస్థితి అయితే క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు ఆ ప‌రిస్థితిని మార్చి.. ఖ‌చ్చితంగా గ్రామీణ ప్రాంతాల నిధుల‌ను వాటికే ఇస్తే.. ప‌వ‌న్ ముద్ర ప‌డిన‌ట్టే. కానీ, అలా జ‌రుగుతుందా? అనేది చూడాలి.

ఇక‌, ఈ గ్రామ స‌భ‌ల్లో ఉపాధి హామీ ప‌థ‌కానికి సంబంధించి కీల‌క నిర్ణ‌యాలు అమ‌లు చేయాల‌న్న‌ది ప‌వ‌న్ భావ‌న‌. ఉపాధి ప‌నుల‌ను పెద్ద ఎత్తున పెంచి.. సోష‌ల్ ఆడిటింగ్ చేయించాల‌న్న‌ది ఆయ‌న ఉద్దేశం. కానీ, ఇది కూడా అంత ఈజీ కాదు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీల‌కు బ‌లంగా ఉన్న నాయ‌కులకు ఉపాధి హామీ ప‌థ‌కం ఒక ఆదాయ వ‌న‌రుగా మారిపోయింది. త‌మ‌వారి పేర్ల‌ను జోడించి.. వారు ప‌నిచేసినా.. చేయ‌క‌పోయినా.. డ‌బ్బులు తీసుకుని దానిలో కొంత క‌మీష‌న్ జేబులో వేసుకుంటూ.. పార్టీల‌నేత‌లు కాలం వెళ్ల‌దీస్తున్నారు. దీనిలో ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడాలేదు.

ఇప్పుడు వారి అక్ర‌మార్జ‌న‌కు బ్రేకులు వేయాల‌న్న ప‌వ‌న్ నిర్ణ‌యం ఏమేర‌కు సాకారం అవుతుంద‌నేది చూడాలి. కానీ, ఇది కూడా అంత ఈజీకాదు. క్షేత్ర‌స్థాయిలో పార్టీ బ‌లంగా ఉండాలంటే.. నాయ‌కుల‌ను చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేయాల‌న్న భావ‌న పార్టీల్లోనే ఉంది. సో.. ప‌వ‌న్ ఆద‌ర్శాలు బాగానే ఉన్నా.. ఫ‌లితాలు.. దానికి తగిన‌ట్టు వ‌చ్చేందుకు అవ‌కాశం అయితే క‌నిపించ‌డం లేదు. అందుకే.. మొద‌ట్లోనే ఆయ‌న ఆలోచ‌న‌ల‌కు బ్రేక్ ప‌డుతూ.. ఏడు రోజులు కాస్తా.. ఒక్క‌రోజుకు వ‌చ్చింది.

This post was last modified on %s = human-readable time difference 12:10 pm

Share
Show comments
Published by
Satya
Tags: FeaturePawan

Recent Posts

ప్ర‌జ‌ల త‌ర‌ఫునే ప‌వ‌న్‌ను ప్ర‌శ్నిస్తున్నా: ప్ర‌కాష్‌రాజ్‌

త‌ర‌చుగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించే బ‌హుభాషా న‌టుడు ప్ర‌కాష్‌రాజ్‌.. మ‌రోసారి ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.…

1 min ago

పేరుకే పాన్ ఇండియా

బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలు దేశవ్యాప్తంగా అదరగొట్టాక.. అందరికీ పాన్ ఇండియా పిచ్చి పట్టుకుంది. మిడ్ రేంజ్, చిన్న…

37 mins ago

ఇది వైసీపీ కాదు.. కూట‌మి ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌: ప‌వ‌న్‌

"ఇది వైసీపీ ప్ర‌భుత్వం కాదు. ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు చేయ‌డానికి. ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వారు వ్య‌వహరించ‌డానికి నిధులు దారి…

2 hours ago

త‌మిళ‌నాట మ‌రో ‘జ‌న‌సేన‌’..

ఏపీలోని జ‌న‌సేన త‌ర‌హా పార్టీ త‌మిళ‌నాడులోనూ ఆవిర్భ‌వించింది. ప్ర‌ముఖ త‌మిళ‌ హీరో విజ‌య్‌.. త‌మిళ‌గ వెట్రి క‌ళ‌గం(టీవీకే) పార్టీని కొన్నాళ్ల…

2 hours ago

విరూపాక్ష మ్యాజిక్.. మరోసారి

సాయిధరమ్ తేజ్ కెరీర్లో బిగ్టెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం.. విరూపాక్ష. హార్రర్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం మాంచి…

4 hours ago

రేవ్ పార్టీ కాదు.. దీపావ‌ళి పార్టీ

తెలంగాణ‌లో జున్వాడలోని మాజీ మంత్రి కేటీఆర్ బంధువు రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జ‌రిగిన వ్య‌వ‌హారం రాజ‌కీయంగా…

11 hours ago