అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది కార్మికులు, ఉద్యోగులు, ఇతర ఉన్నతాధికారులు కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అదే విధంగా 36 మందికిపైగానే తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వివిధ ఆసుపత్రులకు తరలించి వైద్యం అంది స్తున్నారు. మరోవైపు.. మృత దేహాలకు పోస్టు మార్టమ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయా కు టుంబాలను, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను రాజకీయ పార్టీల నాయకులు పరామర్శిస్తున్నారు.
ఇలా పరామర్శించడం తప్పుకాదు. కానీ, ఇక్కడే రాజకీయం చోటు చేసుకోవడం గమనార్హం. ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారికి భరోసా కల్పించారు. వారికి ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి.. వారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. కట్ చేస్తే.. వైసీపీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైసీపీసీనియర్ నాయకులు పరామర్శించారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు, మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సహా పలువురు.. ఆసుపత్రికి వెళ్లి.. బాధితులను పరామర్శించారు. ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున తాము అండగా ఉంటామని తెలిపారు. అయితే.. అటు చంద్రబాబు మాట్లాడుతూ.. వ్యవస్థలను నాశనం చేశారని.. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఈ ఘోరం జరిగిందని పేర్కొన్నారు.
ఇక, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లడుతూ.. ప్రభుత్వం తీవ్ర అలసత్వంతో వ్యవహరించింద న్నారు. మొత్తానికి ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా కాకపయినా.. పరోక్షంగా అయినా.. విమర్శించుకునేందుకు ప్రయత్నించడం గమనార్హం. మరోవైపు.. మాజీ సీఎం జగన్.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ట్వీట్‌చేశారు. బాధితులను తక్షణమే ఆదుకోవడంలో సర్కారు విఫలమైందన్నారు. సరైన సమయంలో వైద్యం అందక.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
This post was last modified on August 22, 2024 4:15 pm
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది.…