Political News

ఆ విష‌యంలో వైఎస్సార్ త‌ర్వాత ష‌ర్మిలేనా…!

కాంగ్రెస్ పార్టీని గమనిస్తే ఆ పార్టీలో అధిష్టానం చెప్పిందే ఫైనల్ డెసిషన్ గా ఉంటుంది. ఇది రాష్ట్రాల పరిధిలో అయినా కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో అయినా దేశవ్యాప్త రాజకీయాల్లో అయినా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమే అంతిమ నిర్ణయం. 136 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఏనాడు పెద్దగా ప్రాంతీయ నాయకులు వెలుగులోకి వచ్చింది లేదు. ఒకళ్ళిద్దరు వచ్చినా వారు పార్టీతో విభేదించి బయటికి వచ్చి సొంతంగా పార్టీలు పెట్టుకున్న వారే ఉన్నారు.

కానీ ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీని శాసించే స్థాయికి ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ స్థాయికి ఆయన తీసుకు రాగలిగారు. తాను తీసుకున్న నిర్ణయాన్ని, తాను చేపట్టిన సంక్షేమ పథకాలను తాను ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు వ్యక్తిగతంగా ఆయన చూపించిన శ్రద్ధ అదేవిధంగా పార్టీ అధిష్టానాన్ని ఒప్పించిన తీరు అప్పట్లో భారీ ఎత్తున చర్చ‌కు వ‌చ్చిన విషయం తెలిసిందే.

దీంతో జాతీయ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ అయిపోయిందన్న విమర్శలు వచ్చాయి. అదే సమయంలో వైఎస్ కాబట్టి కాంగ్రెస్‌ను ఈ స్థాయిలో నడిపిస్తున్నారు అన్న ప్రశంసలు కూడా దక్కాయి. ఆ పరిస్థితిని పక్కన పెడితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ కుమార్తె షర్మిల కూడా అదే స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అంటే ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఆమె చెప్పిందే వేదం ఆమె తీసుకున్న నిర్ణయం ఫైనల్ అన్నట్టుగా ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.

వాస్తవానికి పార్టీ అధిష్టానం ఒకప్పుడు ఏపీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టేది. ఏపీలో ఏం జరుగుతున్నా, ఏపీలో ఎవరిని నియమించాలన్నా.. ఏపీలో ఏం చేయాలన్నా.. అన్ని అధిష్టానమే పరిశీలించి నిర్ణయాలు తీసుకునేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది షర్మిల చెప్పిందే మాట, షర్మిలే ఏం చెప్తే అది చేయాలి అన్న విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి క్షేత్రస్థాయి నాయకులు ఆదేశాలు వస్తుండడం వాటిని పాటించాలని కూడా చెబుతుండడం విశేషం.

తాజాగా జిల్లాల కమిటీ అధ్యక్షులు, అలాగే రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్ష‌ పదవులు కూడా షర్మిల కోరుకున్న వారికి పార్టీ అధిష్టానం ఓకే చేయటం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. అధిష్టానం నిర్ణయం తీసుకుని దాన్నే అమలు చేసేది. కానీ ఇప్పుడు షర్మిల తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం దానికి అంగీకరించడం కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ పరిస్థితి పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుందనేది చూడాలి.

గతంలో తన నిర్ణయాలు, తన సంక్షేమ హామీలు అమలు చేసుకునే క్రమంలో అధిష్టానాన్ని ఒప్పించిన వైఎస్.. పార్టీని అలాగే నడిపించారు. పార్టీని బలోపేతం చేశారు కూడా. అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు షర్మిల ఆ స్థాయిలో పనిచేయగలుగుతారా? అనేది చూడాలి.

This post was last modified on August 22, 2024 1:28 pm

Share
Show comments
Published by
Satya
Tags: Sharmila

Recent Posts

కొత్త తరం దర్శకులతో చిరంజీవి లైనప్

తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…

1 hour ago

అర్థం కాలేదన్న సినిమాను ఎగబడి కొంటున్నారు

కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…

3 hours ago

కాకినాడ పోర్టు మళ్లీ కేవీ రావు చేతికి.. డీల్ కు అరబిందో రెఢీ

గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…

3 hours ago

జపాన్ జనాలకు కల్కి ఎక్కలేదా

ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…

4 hours ago

చరిత్రలో తొలిసారి: మారథాన్ లో మనిషితో రోబోలు

మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…

4 hours ago

ఫ్యాషన్ ఐకాన్ లా నారా లోకేశ్!

నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……

4 hours ago