ఏపీలో ఎగ్ పఫ్
ల పాలిటిక్స్ పీక్స్‌కు చేరింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేసిన వార్తలు.. ఇప్పుడు ప్రదాన మీడియాలోకి కూడా వచ్చేశాయి. దీంతో వైసీపీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు.. మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు, జర్నలిజంపై నిప్పులు చెరిగింది. ఇదేనా మీ జర్నలిజం?
అంటూ నిప్పులు చెరిగింది. అవాస్తవాలను.. సోషల్ మీడియాలో పోస్టు చేసే.. ఎలాంటి వాస్తవాలు తెలుసుకోకుండా.. జాతీయ మీడియా, లోకల్ మీడియాలు ప్రచారం చేయడం ఏంటని వైసీపీ మండిపడింది. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలని, ప్రసారం చేయాలని కోరింది.
ఏంటీ వివాదం?
రాష్ట్రంలో 2019-24 మధ్య వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం వినియోగించిన తినుబండారాల లెక్కలు.. ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీనిలో ప్రధానంగా ఎగ్ పఫ్ ల కోసం ఐదేళ్లలో 3.62 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే.. ఇవి సోషల్ మీడియా వరకే పరిమితం అయ్యాయి. తాజాగా ఇదే విషయాన్ని మీడియా వార్తలుగా మలిచి.. తాడేపల్లిలో ఎగ్‌పఫ్‌ల కుంభకోణం
పేరుతో వార్తలు రాసింది. దీంతో ఇది మరింతగా రాజకీయ దుమారం రేపింది. నిన్న మొన్నటి వరకు ఈ విషయంపై మౌనంగా ఉన్న వైసీపీ తాజాగా జాతీయ మీడియాలోనూ కథనాలు వచ్చాయని తెలిసి.. స్పందించింది.
ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ఉద్యోగులు, సిబ్బంది రోజుకు సగటున 993 ఎగ్ పఫ్స్ తిన్నారని, దీనికిగాను ఏడాదికి 18 లక్షల రూపాయలను ఖర్చు చేశారని టీడీపీ నాయకులు పేర్కొన్న వివరాలను మీడియాలో వివరించారు. దీంతో వైసీపీ ఒక్కసారిగా ఫైరైంది. ఎలాంటి ఆధారాలు లేని ఒక సోషల్ మీడియా ప్రచారాన్ని జాతీయ మీడియా ఎలా ప్రసారం చేస్తుందని.. ప్రచురించిందని మండిపడింది.
ఉద్దేశ పూర్వకంగానే కొందరు జర్నలిస్టులు దుష్ప్రచారం చేశారని పేర్కొంది. అధికారికంగా ధృవీకరించని, నిరాధారమైన సమాచారాన్ని ఎలా ప్రస్తావిస్తారన్న వైసీపీ ప్రశ్న. కాగా, గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ జీడిపప్పు, బాదం పప్పు కోసం.. రూ.6 కోట్లు ఖర్చు పెట్టారంటూ.. పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ అనుకూల మీడియాలోనూ ఈ విషయం పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అప్పట్లో ఈ విషయం తీవ్ర దుమారం రేపింది. ఇక, ఇప్పుడు ఎగ్ పఫ్‌ల వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది.
This post was last modified on August 21, 2024 9:29 pm
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్‌లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…