టీడీపీ యువనాయకుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్.. ఉరఫ్ చిన్నబాబు రాజకీయాల పై టీడీపీలో ఆసక్తి కర చర్చ సాగుతోంది. నిన్న మొన్నటివరకు రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే పరిమితమైన ఆయన.. ఇక, ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చక్రం తిప్పనున్నారా? అనేది చర్చ. దీనిపై టీడీపీ నాయకులే చర్చిం చుకోవడం విశేషం. తాజాగా నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. అయితే.. ఇది ఏ కేంద్ర మంత్రుల నో కలసుకునేందుకు కాదు. పెట్టుబడులు తెచ్చేందుకు కూడా కాదు.
కానీ, నారా లోకేష్ డిల్లీకి వెళ్తున్నారు. దీనికి కారణం.. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సమావేశం జరగనుండడమే. ప్రస్తుతం టీడీపీ ఎన్డీయే కూటమిలో ఉన్న విషయం తెలిసిందే. దీనిలో బీజేపీ సహా ఇతర ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఆయా పార్టీలతో ఇప్పటి వరకు చంద్రబాబుకు మాత్రమే పరిచయం ఉంది. సుదీర్ఘ కాలంగా అనుబంధం ఉన్న నాయకులు కూడా ఉన్నారు. దీంతో ఇలాంటి సమావేశాలకు ఎప్పుడూ చంద్రబాబు మాత్రమే వెళ్తున్నారు. అయితే.. తొలిసారి నారా లోకేష్‌ను పంపిస్తున్నారు.
ఈ సమావేశాల అజెండా ఏంటనేది తెలియకపోయినా.. నారా లోకేష్ పర్యటనకు మాత్రం చాలా ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటివరకు రాష్ట్రానికి మాత్రమే తెలిసిన నారా లోకేష్ ఢిల్లీ ల్లో కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ.. రాబోయే రోజుల్లో అంతా నారా లోకేష్ రాజకీయాలు నడుస్తాయన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో కేవలం ఆయనను రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయకుండా.. జాతీయ రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరించేలా చేయాలన్నది పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే స్వయంగా చంద్రబాబు నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.
ఇదిలావుంటే.. 2014 ఎన్నికల సమయంలో ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చిన నారా లోకేష్.. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ మండలిలో ప్రవేశించి.. అటు నుంచి మంత్రి అయ్యారు. ఇక, తాజా ఎన్నికల్లో మంగళగిరి నుంచి 90 వేల ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు . మరోసారి మంత్రి పదవిని చేపట్టారు. అయితే.. గతైదేళ్లు కూడా.. వైసీపీ సర్కారుపై తీవ్ర రాజకీయ పోరాటం చేయడంతోపాటు.. యువగళం పేరుతో పాదయాత్ర కూడా చేపట్టారు. అంతేకాదు.. చంద్రబాబును అరెస్టు చేసి జైల్లొ పెట్టినప్పుడు నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియా ద్వారా.. దేశం మొత్తానికి తమకు జరిగిన అన్యాయాన్ని తెలిపారు.
This post was last modified on August 21, 2024 4:35 pm
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…
తిరుమల తొక్కిసలాట ఘటనపై శుక్రవారం సాయంత్రం టీటీడీ అత్యవసరంగా భేటీ అయి సమీక్షించింది. ఈ సమావేశంలో భాగంగా మృతుల కుటుంబాలకు…
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…