తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఆషాడం పోయి శ్రావణమాసం వచ్చినా అడుగు ముందుకు సాగడం లేదు. తాజాగా ఈ విస్తరణ వ్యవహారం అంతా దసరా తర్వాతేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. గత డిసెంబరులో ప్రభుత్వం ఏర్పాటయినప్పుడు ముఖ్యమంత్రితో సహా 12 మంది మంత్రులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల తర్వాత విస్తరణ ఉంటుందన్న ఊహాగానాలు వినిపించాయి. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటి పార్టీ అభ్యర్థులను గెలిపించిన వారికే పదవులు అని టార్టెట్లు కూడా విధించారు. సీఎం సహా పలువురు మంత్రులు ఢిల్లీలో ఐదు రోజుల పాటు మకాం పెట్టినా మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలన్న వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు.
ఈ లోపు ఆషాడమాసం రావడంతో ఆషాడం ముగిసి శ్రావణంలో అడుగుపెట్టగానే విస్తరణ ఖాయం అని అన్నారు. శ్రావణమాసం వచ్చి 15 రోజులు అవుతున్నా మంత్రి వర్గ విస్తరణ ఊసెత్తడం లేదు. తాజాగా దసరా తర్వాతే విస్తరణ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యవసాయ సలహాదారుగా క్యాబినెట్ పదవి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ కు డెయిరీ ఫెడరేషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టారు.
పార్టీ మారిన ఇద్దరికి పదవులు దక్కడంతో మరి మంత్రి పదవులు ఎవరికి ? అన్న చర్చ మొదలయింది. యాదవ సామాజికవ వర్గం నుండి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ముదిరాజ్ సామాజిక వర్గం నుండి మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరికి పదవులు ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతుంది. ఇక భువనగిరి ఎంపీ గెలుపులో కీలకపాత్ర పోషించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ తదితరుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి.
వీరు కాకుండా ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, సికింద్రాబాద్ కంటో న్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచిన శ్రీగణేష్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, వీ6, వెలుగు పత్రికల అధినేత, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సోదరుడు గడ్డం వినోద్, మదన్ మోహన్ రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఎస్టీ కోటాలో వెడ్మ బొజ్జు తదితరులు మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
ఇక తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికయిన ప్రొఫెసర్ కోదండరాంకు మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతుంది. ఏకంగా డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఈ మేరకు డిమాండ్ ను కాంగ్రెస్ అధిష్టానం ముందు ఉంచడం విశేషం. ఇక ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా ఆశావాహుల్లో ఉన్నాడు. ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులలో నాలుగు మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ విస్తరణలో చోటు దక్కించుకునే దసరా బుల్లోళ్లు ఎవరు అనే చర్చ కాంగ్రెస్ వర్గాలలో నడుస్తుంది.
This post was last modified on August 21, 2024 9:50 am
కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…
టాలీవుడ్ లోనే కాదు అటు ఉత్తరాదిలోనూ మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీగా విపరీతమైన అంచనాలు మోస్తున్న పుష్ప 2…
సెలబ్రెటీలు ఏం చేసినా వార్తే. అలాంటిది ఒక స్టార్ హీరో వైన్ షాపుకి వెళ్లి మద్యం కొంటే అంతకంటే వార్త…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ నిర్ణయించారు. ఈ లీక్…
పాపం దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా…
ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ 4 బాలకృష్ణ, బన్నీల ఇంటర్వ్యూలో మొదటి భాగం నిన్న అర్ధరాత్రి…