ఏపీ సీఎం చంద్రబాబు మంత్రాంగం ఫలించింది. ఇటీవల ఆయన ఢిల్లీ పర్యటన సందర్భంగా అమరావతి కోసం.. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన రూ.15 వేల కోట్లను ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సహా ఆర్థిక మంత్రినిర్మలా సీతారామన్‌ను కోరారు. దీంతో వారు ప్రపంచ బ్యాంకుతో మాట్లాడినట్టు ఉన్నారు. ఫలితంగా ఏపీకి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు విచ్చేశారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు అమరాతిలోని ప్రతి ప్రాంతాన్నీ పరిశీలించి.. క్షుణ్ణంగా ఇక్కడి ప్లాన్‌ను రాబోయే సంస్థలను, నవ నగరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా ఇప్పటికే పూర్తయిన భవనాల తాలూకు నాణ్యతను కూడా తెలుసుకున్న ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు.. సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం చంద్రబాబుతోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన అమరావతి ప్రాధాన్యాన్ని.. గతంలో తాము ప్రపంచ బ్యాంకును అప్పు కోసం చేసిన విజ్ఞాపనను కూడా ప్రస్తావించారు. అప్పట్లోనూ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వచ్చి చూసి వెళ్లారని.. అయితే.. కొందరు సృష్టించిన అపోహలతో అప్పు ఇచ్చేందుకు నిరాకరించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇక, పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థల వివరాలను కూడా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు.
చంద్రబాబు చెప్పిన వివరాలపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు మొత్తం 5 వాయిదాల్లో రూ.15 వేల కోట్లను ఇచ్చేందుకు ప్రాథమికంగా సమ్మతించినట్టు తెలిసింది. అయితే.. దీనికి సంబంధించిన ప్రాసెస్ జరగాల్సి ఉంది. అమరావతి ప్రాజెక్టులో పనుల పురోగతి, క్షేత్రస్థాయి పర్యటనలు, భూసమీకరణ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై ఈ సమావేశంలో చర్చించారు. అయితే.. మరిన్ని విషయాలను అధికారులతో చర్చించాలని చంద్రబాబు సూచించగా.. వారు అంగీకరించారు. దీంతో మరో రెండు రోజుల పాటువారు ఏపీలోనే ఉండనున్నారు. ఏదేమైనా.. అమరావతికి రుణం ఇచ్చేందుకు సమ్మతించడం చంద్రబాబుకు పెద్ద రిలీఫ్ లభించినట్టేనని అంటున్నారు.
This post was last modified on August 21, 2024 7:26 am
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…