ఏపీకి తాజాగా ఓ అవార్డు వచ్చింది. సంప్రదాయ ఇంధన వనరుల విభాగంలో వచ్చిన `గ్రీన్ ఎనర్జీ చాంపియన్` అవార్డు.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియన్ విండ్ పవర్ అసోసియేషన్ 2023-24 సంవత్సరానికి గ్రీన్ ఎనర్జీ చాంపియన్ గా ఏపీని ప్రకటించింది. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ఏపీకి ప్రదానం చేశారు. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ, సీఈవో ఎం. కమలాకర్ బాబు ఈ అవార్డు స్వీకరించారు. అయితే.. ఇదే అవార్డును సొంతం చేసుకునేందుకు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు పోటీ పడ్డాయి.
అయితే.. ఈ అవార్డు వ్యవహారంపై గత పాలక పార్టీ వైసీపీ, ప్రస్తుత కూటమి పాలక పార్టీ టీడీపీలు నా ఘనతంటే నాదేనని చెప్పుకొంటున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు ఏపీకి దక్కిందంటే ఆ ఘనత సీఎం చంద్రబాబుదేనని టీడీపీ నాయకులు అంటున్నారు. గతంలో 2014-19 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన రంగంలో చేసిన కృషి ఇప్పుడు అవార్డు రావడానికి కారణమైందని పేర్కొంటున్నారు. అప్పట్లో గ్రీన్ ఎనర్జీని చంద్రబాబు ప్రోత్సహించారని.. అందుకే అప్పట్లో గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు కూడా వచ్చాయని అంటున్నారు. ఈ క్రమంలోనే అవార్డు రావడం వెనుక చంద్రబాబు కృషి ఉందని చెబుతున్నారు.
వైసీపీ నాయకులు మాత్రం ఈ అవార్డు తమ పార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి జగన్ కృషితోనే సాధ్యమైందని చెబుతున్నారు. సోలార్ విద్యుత్, విండ్ పవర్ వంటి వాటిలో చేసుకున్న ఒప్పందాలు.. చేసిన మార్పులు గణనీయంగా ఫలించాయని.. అందుకే 2023-24 కాలానికి ఈ అవార్డును రాష్ట్రానికి అందించారని అంటున్నారు. ఇదేసమయంలో టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్య లకు కౌంటర్ ఇస్తున్నారు. ఎప్పుడో చేసిన పనికి ఇప్పుడు అవార్డు ఇచ్చారని ఎలా చెబుతారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ అవార్డు రావడం వెనుక జగన్ చేసిన వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికలే ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి అవార్డు రావడం వరకు బాగానే ఉన్నా.. ఇలా అధికార, విపక్షాల మధ్య ఈ అవార్డు కూడా రాజకీయంగా దుమారం రేపడం గమనార్హం.
This post was last modified on August 19, 2024 5:34 pm
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…