ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి రెండు మాసాలు పూర్తయ్యాయో లేదో.. టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తన కలల ప్రాజెక్టు అమరావతి రాజధానికి ఇప్పటి వరకు 30 వేల కోట్ల రూపాయలను ఆయన సమీకరించే ప్రయత్నం చేశారు. దీంతో రాజధాని నిర్మాణం పరుగులు పెట్టడం ఖాయమని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన మేరకు ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల రుణ సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తో కలిసి ఆ మొత్తాన్ని మంజూరు చేయనున్నట్లు సమాచారం.
ఆయా బ్యాంకుల ప్రతినిధులు సోమవారం నుంచి ఈ నెల 27 వరకు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై ప్రభుత్వంతో చర్చించనున్నారు. వీలైనంత త్వరలోనే రుణం మంజూరు చేసే అవకాశముందని తెలుస్తోంది. దీంతో కేంద్రం బడ్జెట్ లో ప్రతిపాదించిన రూ.15 వేల కోట్ల మేరకు అందించే అవకాశం కనిపిస్తోంది. ఇది ఒక భారీ ఊతంగా మారనుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విడిగా ప్రపచం బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లను సమీకరించేందుకు రెడీ అయింది. అయితే.. కేంద్రం ఇప్పిస్తున్నరూ.15 వేల కోట్లు.. రాజధాని పునర్నిర్మాణానికి వినియోగించనున్నారు.
అయితే.. రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానుగా సేకరించే రూ.15 వేల కోట్లు నవ నగరాలను అభివృద్ది చేయాలన్న ఉద్దేశంతో తీసుకురానుంది. దీనికి కూడా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అంగీకరించే అవకాశం ఉంది. గత వారమే సీఎం చంద్రబాబుతో వరల్డ్‌బ్యాంక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధాని అమరావతిలో నవనగరాల నిర్మాణంపై చర్చించారు. నిర్మాణాలు, రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. రైతులతో మాట్లాడిన ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. వరల్డ్‌క్లాస్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దేలా.. భవిష్యత్ ప్రణాళికలు వివరించిన సీఎం చంద్రబాబు సాయం చేయాలని అప్పట్లోనే కోరారు.
ఇక, ఇప్పుడు కేంద్రం ప్రతిపాదించిన రుణం వేరుగా అందనుందని తెలుస్తోంది. మొత్తం అటు కేంద్రం, ఇటు రాష్ట్ర సర్కారులు రూ.30 వేల కోట్ల మేరకు అప్పుల రూపంలో సమీకరించి రాజధానికి కేటాయించనున్నారు. దీంతో నవనగరాలు సహా.. రాజధాని రూపు రేఖలు మారిపోతాయని.. తద్వారా పెట్టుబడులు తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుందని సర్కారు అంచనా వేస్తోంది. కొంత పురోగతి కనిపిస్తే.. ప్రజలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాదిలో రాజధాని ప్రాంతానికి ఒక కళ తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం.
This post was last modified on August 19, 2024 5:09 pm
కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…
టాలీవుడ్ లోనే కాదు అటు ఉత్తరాదిలోనూ మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీగా విపరీతమైన అంచనాలు మోస్తున్న పుష్ప 2…
సెలబ్రెటీలు ఏం చేసినా వార్తే. అలాంటిది ఒక స్టార్ హీరో వైన్ షాపుకి వెళ్లి మద్యం కొంటే అంతకంటే వార్త…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ నిర్ణయించారు. ఈ లీక్…
పాపం దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా…
ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ 4 బాలకృష్ణ, బన్నీల ఇంటర్వ్యూలో మొదటి భాగం నిన్న అర్ధరాత్రి…