రాష్ట్రంలో ఐపీఎస్ ల వివాదం కొనసాగుతోంది. వైసీపీ హయంలో పనిచేసిన 16 మంది కీలక ఐపీఎస్ అధికారులను ప్రస్తుత ప్రభుత్వం వెయిటింగ్ లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే వీరందరిని ఉదయం 10 గంటలకు డిజిపి ఆఫీసుకి రావాలని సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఉండాలని ఆదేశించడం, అదేవిధంగా రిజిస్టర్లలో సంతకాలు చేసి వెళ్ళాలి అని ప్రభుత్వం పేర్కొనడంతో ఇది వివాదంగా మారింది. వాస్తవానికి వెయిటింగ్ లో ఉన్న అధికారులు డిజిపి కార్యాలయానికి రావాలా? అవసరం లేదా. అనే విషయం ఇప్పటివరకు చర్చకు రాలేదు.
కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఆదేశించిన తర్వాత ఐపీఎస్ ల విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఏ ఐపిఎస్ అయినా ఏఐఎస్ అయినా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటారు. అది వైసిపి ప్రభుత్వం అయినా టిడిపి ప్రభుత్వమైనా ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకుంటారు.
అయితే వైసిపి హయాంలో తమపై వ్యక్తిగతంగా కక్షకట్టు కుని కేసులు పెట్టారనే ఉద్దేశంతో టిడిపి నాయకులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం నారా లోకేష్ పై కేసులు పెట్టడం అదేవిధంగా ఇతర నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపించే ప్రయత్నం చేసినటువంటి ఐపీఎస్ లపై సహజంగానే టిడిపి నాయకుల్లో కోపం ఉంది.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 16 మంది ఐపీఎస్ లను పక్కన పెట్టారు అనే వాదన వినిపిస్తోంది. దీనిపై తాజాగా తెలంగాణకు చెందిన మాజీ డిజిపి లు స్వర్ణజిత్ సేన్ సహా మరికొందరు విమర్శలు చేశారు. ఐపీఎస్‌లను అవమానిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. దీంతో విషయం రాజకీయంగా వివాదం రేపింది. తాను చేసింది తప్పు కాదని ప్రభుత్వ అనుకూల వర్గాలు చెబుతుండగా ఐపీఎస్ వర్గాలు మాత్రం మౌనంగా ఉన్నాయి. అయితే వాస్తవం మాత్రం వెయిటింగ్ లో ఉన్న అధికారులు కచ్చితంగా నిర్దేశిత ఆఫీసుకు వచ్చి సంతకాలు పెట్టాలనేది రూల్ అయితే ఉంది. దీన్ని ఇప్పటివరకు ఎవరూ పాటించలేదు.
కానీ ఇప్పుడు తొలిసారి టిడిపి ప్రభుత్వం దీనిని అమలుచేస్తోంది ఇదే వివాదానికి కారణమైంది మరోవైపు వెయిటింగ్ లో ఉన్న అధికారులను కొనసాగించాలా లేక కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలా అనే విషయంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఏదేమైనా రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు ప్రభుత్వ విధానాల మేరకు నడుచుకోవాల్సిన అధికారులు.. రాజకీయంగా నాయకుల మాటలకు ప్రాధాన్యం ఇవ్వడం.. వారు చెప్పినట్టు నడుచుకోవడం వివాదాలకు దారి తీయడం గమనించాల్సిన విషయం. చివరకు ఇది ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.
This post was last modified on August 18, 2024 11:28 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…