అన్న క్యాంటీన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందా? ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఏడాదికి 200 కోట్ల రూపాయలు అదనంగా ఈ క్యాంటీన్ల కోసం వెచ్చించాల్సి ఉందా? అలాంటప్పుడు ఈ క్యాంటీన్ ల వల్ల ప్రభుత్వానికి భారమే తప్ప ప్రయోజనం ఏంటి? అనేది ఇప్పుడు ప్రశ్న.
నిజానికి అన్న క్యాంటీన్ ఉద్దేశం పేదలకు చెరువ కావడం. సంక్షేమం అమలు చేయడంలో వైసిపి కన్నా తామే ముందున్నామని చెప్పుకునే లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతానికి భిన్నంగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రారంభించారు.
నిజానికి 2014-2019 మధ్యకాలంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని అనుకున్నప్పుడు 2019 ఎన్నికలకు నాలుగు మాసాల ముందు మాత్రమే వీటిని ఏర్పాటు చేశారు. అప్పట్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే అన్న క్యాంటీన్లను తీసుకురావడం ద్వారా సంక్షేమానికి తామే అన్ని విధాల అండగా ఉన్నామని పేదల పక్షానికి తామే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పుకునే ఉద్దేశ్యం ఉంది. అయితే అన్న క్యాంటీన్ల ద్వారా ప్రభుత్వం పై రెండు వందల కోట్ల రూపాయల భారం పడుతుందని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు.
కానీ, ఇప్పుడు ఆహారం కూడా లేకుండా సాధ్యమైనంత వరకు విరాళాల ద్వారా అన్న క్యాంటీన్ నిర్వహించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే విరాళాలు ఇవ్వాలంటూ ఎకౌంట్ నెంబర్ను కూడా చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. దీనికి తోడు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర శుభకార్యాలు కూడా అన్న క్యాంటీన్ల వద్ద నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. తద్వారా క్యాంటీన్లకు వచ్చే పేదలకు ప్రభుత్వం తరఫున భారం పడకుండా విరాళాల రూపంలో అదేవిధంగా ఆయా కార్యక్రమాలు నిర్వహించే వారి పక్షాన భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
ఇదే జరిగితే అన్నా క్యాంటీన్ల భారం ప్రభుత్వంపై పెద్దగా ఉండకపోవచ్చు. అదేవిధంగా జిల్లాల స్థాయిలోను నియోజకవర్గం కేంద్రంగా అన్న క్యాంటీన్లను నడిపించే బాధ్యత పరోక్షంగా ఎమ్మెల్యేలకు అప్పగించాలని కూడా చంద్రబాబు భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన అయితే రానుంది. అంటే ఒక నియోజకవర్గంలో ఏర్పాటు చేసే అన్న క్యాంటీన్లకు నెలకు కనీసం 10 నుంచి 15 రోజులు పాటు పూర్తిస్థాయిలో విరాళాలు సేకరించే బాధ్యతను ఎమ్మెల్యేలకు అదే విధంగా ఎంపీలకు చంద్రబాబు అప్పగించే ఉద్దేశంలో ఉన్నారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బిజెపి జనసేన ఎమ్మెల్యేలను పక్కన పెడితే మిగిలిన వారు 135 మంది ఉన్నారు. వీరందరికీ ఈ బాధ్యతను అప్పగించడం ద్వారా అన్న క్యాంటీన్ లపై ప్రభుత్వం భారాన్ని తగ్గించుకునే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. సాధారణంగా ఎమ్మెల్యేలకు ఇది పెద్ద భారం అయ్యే విషయం కాదు. స్థానికంగా ఉన్న పారిశ్రామికవేత్తల నుంచి అదే విధంగా వ్యాపారుల నుంచి విరాళాల రూపంలో నిధులు సేకరించి అన్న క్యాంటీన్లను సులభంగా నడిపించే అవకాశం ఉంది. ఎలా చూసుకున్న భారం లేని సంక్షేమాన్ని అన్నా క్యాంటీన్ల రూపంలో చంద్రబాబు అమలు చేయనున్నారు అనేది వాస్తవం.
This post was last modified on August 18, 2024 11:25 am
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది.…