రాజకీయాలు చేసేందుకు వస్తువుతో పనిలేదు.. అవకాశం, అవసరం అనే రెండు పట్టాలే ముఖ్యం. మారుతున్న కాలంలో నాయకులు, పార్టీల పంథా కూడా ఇదే వస్తు ప్రాధాన్యాన్ని ఎంచుకుని ముందుకు సాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. “ఏం చేస్తావన్నది కాదు.. గెలిచామా? లేదా?“ అన్నది ముఖ్యం అంటూ.. సాక్షాత్తూ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. మహారాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఏడాది కిందట బహిరంగంగా చేసిన వ్యాఖ్య ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాసి.. శివసేనలో ముసలం పుట్టించి.. ప్రభుత్వాన్ని నిలువునా చీల్చిన ఘటన.. యావత్ దేశాన్నీనివ్వెరపోయేలా చేసింది. దీనినే రాజకీయం అంటారంటూ.. బీజేపీ అనుకూల వర్గాలు సమర్థించుకున్నాయి.
కట్ చేస్తే.. ఇప్పుడు ఇంతకు మించిన రాజకీయ పరిణామాలు.. దేశానికి తూర్పు-ఈశాన్యాల సరిహద్దులో ఉన్న పశ్చిమ బెంగాల్‌లోనూ జరుగుతున్నాయి. అంతా.. రాజకీయం.. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో గెలుపు తంత్రమే ముఖ్యంగా రాజేసుకుంటున్న రాజకీయాలు.. ఇప్పుడు అందరినీ నివ్వెర పోయేలా చేస్తున్నాయి. గత ఐదేళ్ల పరిస్థితిని గమనిస్తే.. ఆది నుంచి బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మధ్య రాజకీయాలు కనిపిస్తాయి. మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం చూపించిన దూకుడు.. అప్పటి గవర్నర్‌గా ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చూపిన అత్యుత్సాహం వంటివి రాజకీయ దుమారానికి, మమతాగ్రహానికి కూడా దారి తీశాయి.
అయితే.. ఇప్పుడు మమత కూడా ఎక్కడా తగ్గడం లేదు. పంటికి పన్ను.. కంటికి కన్ను.. అన్నట్టుగా బీజేపీ చేస్తున్న రాజకీ యాలకు ప్రతిరాజకీయాలు చేస్తున్నారు. సందేశ్ ఖాలీలో మహిళలపై అత్యాచారం, దాడుల ఘటనను బీజేపీ తనకు అనుకూ లంగా మార్చుకున్నప్పుడు మమత అసలు విషయాన్ని వదిలేసి.. బీజేపీపై ఎదురు దాడి చేసిన విషయం, ఏకంగా సీబీఐ అధికారులనే మమత మద్దతు దారులు పరుగులు పెట్టించి కొట్టిన వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. ఇక్కడ సమస్య కంటే కూడా.. రాజకీయమే చోటు చేసుకుంది. అటు బీజేపీ, ఇటు తృణమూల్ రాజకీయ మధ్య సందేశ్ ఖాలీ సమాప్తమైపోయిం ది.
కట్ చేస్తే.. ఇప్పుడు కోల్‌కతాలో ఓ ఆసుపత్రిలో జూనియడ్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం.. అనంతర హత్య పరిణామాలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే.. సీఎం మమత రోడ్డెక్కి ఈ ఘటనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడంతోపాటు.. సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేయాలని, నిందితుడిని ఉరితీయాలన్న డిమాండ్‌ను వినిపించడం. సహజంగా.. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా రోడ్డెక్కడం ఇదే తొలిసారి. పైగా జరిగిన ఘటన శాంతిభద్రతలకు సంబంధించిన వ్యవహారం. అంటే.. ముఖ్యమంత్రి చేతులో ఉన్న అంశమే. కానీ ఆమేనేరుగా రోడ్డెక్కి రాద్ధాంతం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. రాజకీయమే కారణం.
పశ్చిమ బెంగాల్‌లో 66 మంది ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ వేళ్లూనుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ మమతను గద్దెదించాలన్న ఏకైక లక్ష్యంతో బీజేపీ చేస్తున్న రాజకీయాలే ఇక్కడ నిరంతరం.. ఉద్రిక్తతలను పెంచి పోషిస్తున్నాయన్నది దేశమెరిగిన సత్యం. దీనిని సాధ్యమైనంత వరకు ఎదుర్కొనేందుకు ప్రయత్నించిన మమతకు.. ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయిన దరిమిలా.. ఇక, రోడ్డెక్కాల్సిన అగత్యం ఏర్పడిందనేది జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అందుకే.. అమానుష ఘటన కూడా .. ఇప్పుడు రాజకీయ వాదప్రతివాదాలకు, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునేందుకు (బీజేపీ కూడా ఇక్కడ వరుసగా నిరసనలు చేస్తున్న విషయం గమనార్హం) వెరవని పరిస్థితిని కల్పించాయి. 294 స్థానాలు ఉన్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్-మే మధ్య జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హత్యాచార ఘటన కూడా రాజకీయ తంత్రంలో ఎన్నికల వ్యూహానికి అందివచ్చిన ఆయుధంగా మారడం దురదృష్టకరం.
This post was last modified on August 18, 2024 10:35 am
తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయపడ్డారు. వీరిలో మరో…
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…