ఏపీ కలల రాజధాని అమరావతి నిర్మాణం.. మళ్లీ పట్టాలెక్కుతోంది. దీనిని వడివడిగా పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు తన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం నుంచి ఏదో ఒక రూపంలో నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. త్వరలోనే రూ.15 వేల కోట్ల ను అప్పు రూపంలో కేంద్రం ఇప్పించేందుకు రెడీ అయింది. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వమే.. సొంతగా మరిన్ని నిధులు సమకూర్చుకునేందుకు ప్రణాళికలు రెడీ చేసుకుంది.
వీటిలో విరాళాల రూపంలో 10 వేల కోట్ల వరకురాబట్టాలని నిర్ణయించింది. గతంలో అమరావతి ఇటుకలు పేరుతో ఒక వినూత్న కార్యక్రమాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో అమరావతి నిర్మా ణం కోసం.. ఇటుకలకు విరాళాలు ఇచ్చే కార్యక్రమాన్ని 2017-19 మధ్య కాలంలో జోరుగా సాగించారు. దీనికి ప్రత్యేకంగా అకౌంటు ఏర్పాటు చేసి ఇటుకకు రూ.10 చొప్పున విరాళాల రూపంలో సేకరించారు. దీనికి భారీగానే స్పందన వచ్చింది. దేశవిదేశాల్లోని ఏపీ ప్రజలు.. ఇటుకలకు లక్షల రూపాయల్లో విరాళాలు ఇచ్చారు.
ఇప్పుడు మరోసారి ఇటుకల విరాళాలను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి.. చంద్రబాబు పాత ప్రణాళికలను కొత్తగా అమలు చేసేందుకు రెడీ అయ్యారు. దీనివల్ల కొంత మేరకు నగదు సమకూరనుంది. ఇదిలావుంటే.. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లను అప్పుగా పుచ్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇప్పటికే ఇక్కడ పర్యటించి వెళ్లారు. ఇవన్నీ.. ఇలా ఉంటే.. తనకు పరిచయం ఉన్న బౌద్ధమత గురువు.. దలైలామా ద్వారా కూడా అమరావతి నిర్మాణానికి అంతర్జాతీయంగా విరాళాలు సేకరించనున్నట్టు తెలుస్తోంది.
రామచంద్రచౌదరి అనే స్కాలర్ ఒకరు.. తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు బౌద్ధులు కూడా అందివస్తున్నట్టు తెలిపారు. బౌద్ధారామంగా విలసిల్లిన అమరావతిని అభివృద్ధి చేసేందుకు.. దలైలామా నేతృత్వంలో విరాళాలు సేకరిస్తే.. బాగుంటుందని,ఆ దిశగా చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. అయితే.. దీనిపై ఇంకా అధికార ప్రకటన ఏమీ రాలేదు. కానీ.. ఇది నిజమేనని అనిపిస్తోంది.
ఎందుకంటే.. గతంలో దలౌలామా.. 2006-7 మధ్య అమరావతిలో బౌద్ధ కార్యక్రమాన్నినిర్వహించారు. సో.. ఆయనకు ఇక్కడి సంగతులు తెలుసు. పైగా బౌద్ధులకు అమరావతి అత్యంత పవిత్ర ప్రాంతంగా కూడా ఉంది. ఈ నేపథ్యంలో రామచంద్రచౌదరి చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదు. ఆయన చెబుతున్నట్టు రూ.5 లక్షల కోట్ల వరకు దలైలామా ద్వారా నిధులు సమకూరనున్నాయని అంటున్నారు. పోనీ.. అంత కాకపోయినా.. 50 వేల కోట్లయినా.. సమకూరితే.. అమరావతి పరుగులుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on August 16, 2024 10:21 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…