రాష్ట్రంలో ప్రారంభమైన అన్న క్యాంటీన్ల ద్వారా.. పేదల ఆకలి మంటలు చల్లారుతాయని సీఎం చంద్ర బాబు తెలిపారు. గురువారం మధ్యాహ్నం గుడివాడలో ఆయన రాష్ట్రంలో తొలి అన్న క్యాంటీన్‌ను పునః ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు. పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వంతో చేతులు కలిపేందుకు అందరూ తరలి రావాలంటూ.. ఆయన పిలుపుని చ్చారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి విరాళాలు ఇవ్వాలని ఆయన సూచించారు.
రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 200 పైచిలుకు క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం తొలి క్యాంటీన్‌ను ప్రారంభించా రు. శుక్రవారం మిగిలిన 99 క్యాంటీన్లను కూడా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో వచ్చే రెండు మూడు మాసాల్లో మిగిలిన లక్ష్యం కూడా చేరుకుంటున్నట్టు తెలిపారు. సెప్టెంబరు చివరి నాటికి మొత్తం 203 అన్న క్యాంటీన్ లు ప్రారంభించేలా ప్రభుత్వం పనులు చేపట్టిందన్నారు.
అన్న క్యాంటీన్ పున: ప్రారంభంపై మంచి స్పందన వస్తోందని తెలిపారు. సాధారణ ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, వృద్ధులు సైతం తరలి వచ్చి అన్న క్యాంటీన్ లకు విరాళాలు ఇస్తున్నారు. బుధవారం ఒక్కరోజే రూ.2 కోట్లకు పైగా విరాళం ప్రభుత్వానికి అందింది. వివిధ వర్గాల ప్రజలు, సంస్థలు విరాళాలు ఇచ్చేందు కు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అన్న క్యాంటీన్ ల నిర్వహణ చూస్తన్న మునిసిపల్ శాఖ విరాళాలు తీసుకునేందుకు బ్యాంక్ వివరాలు ప్రకటించింది.
విరాళాలు ఇచ్చే వారు.. ఈ అకౌంట్ కు విరాళాలు పంపవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
Name:- ANNA CANTEENS
A/C.no.37818165097
Branch:- SBI,CHANDRMOULI NAGAR, GUNTUR
IFSC : SBIN0020541
This post was last modified on August 16, 2024 6:07 am
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…