అధికారంలో ఉన్నపుడు విర్రవీగిన వైసీపీ ముఖ్య నేతల్లో ఒక్కొక్కరిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇలా అధికారంలోకి రావడం ఆలస్యం వైసీపీ నేతల పని పట్టేయాలని టీడీపీ, జనసేన అభిమానులు ఆవేశపడ్డారు కానీ.. ఈ విషయంలో మరీ దూకుడుగా ఉంటే జనాలకు వేరే సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
వైసీపీ నేతల అవినీతి వ్యవహారాల గురించి పూర్తి ఆధారాలు బయటికి తీసి, పక్కాగా కేసుల్లో ఇరికించడానికే చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తొలి టార్గెట్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ద్వారంపూడి ఎంతగా రెచ్చిపోయారో తెలిసిందే. ఆయన్ని అవినీతి కేసుల్లో గట్టిగా ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాాచారం.
తాజాగా జోగి రమేష్ మీదికి ప్రభుత్వం దృష్టి మళ్లింది. అధికారంలో ఉండగా జోగి రమేష్ ఎలా నోరు పారేసుకున్నారో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను ఎలా తిట్టిపోశారో తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఎటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా కొని విక్రయించి సొమ్ము చేసుకున్న కేసులో జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌ను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మరోవైపు టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో రమేష్ నిందితుడిగా ఉన్నారు.
కాగా ఇప్పుడు రాజీవ్ అరెస్ట్ నేపథ్యంలో రమేష్ స్వరం మార్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, కులం కార్డు ప్రయోగిస్తున్నా ఫలితం ఉండట్లేదు. అధికారంలో ఉండగా తండ్రీ కొడుకులు ఎలా విర్రవీగారో తెలియజేసే వీడియోలను టీడీపీ, జనసేన మద్దతుదారులు బయటికి తీస్తున్నారు.
నారా లోకేష్ మంగళగిరిలో మట్టికరవబోతున్నాడని.. ఆయన్ని కృష్ణానదిలో కలిపేద్దామని జోగి రమేష్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇక రాజీవ్ యుఎస్‌లో చదువుకుని వచ్చాడని, అన్యాయంగా అరెస్ట్ చేశారని అంటున్నారు కానీ.. ఒకప్పుడు అతను చంద్రబాబు ఒక రోగి అని.. ఆయనకు అల్జీమర్స్ ఉందని.. చాలా అభ్యంతరకరంగా మాట్లాడిన వీడియోతో పాటు అతడి ‘అతి’కి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
This post was last modified on August 14, 2024 8:02 pm
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…