నిశ్శబ్ద విప్లవం దిశగా షర్మిల అడుగులు వేస్తున్నారు. తన మాటకు తిరుగులేకుండా, తాను చెప్పిందే వేదంగా భావించి నడిచే నాయకులను ఆవిడ తన కోటరీలో చేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలు చేసే పార్టీగా పేరు ఉంది. తెలంగాణను తీసుకుంటే అక్కడ కూడా రేవంత్ రెడ్డి సహా అనేకమంది నాయకులు ఉన్నప్పటికీ గ్రూపు రాజకీయాలు కామన్ గా మారాయి. ఇది ఆది నుంచి ఉన్న ఒక సంస్కృతి. కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయానికి పెట్టింది పేరు.
ఎవరి గ్రూపులు వాళ్ళవి, ఎవరి రాజకీయాలు వాళ్ళవి. అధిష్టానాన్ని మెప్పించి ఒప్పించి పదవులు తెచ్చుకున్న గ్రూపులు, అధిష్టానాన్ని మెప్పించలేక సాధారణ నాయకులుగా మిగిలిపోయిన వారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువమంది ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఏపీలో గ్రూపు రాజకీయాలకు చెక్‌పెట్టి.. తానే ఒక గ్రూప్ గా మారేటటువంటి సంకేతాలు షర్మిల ఇస్తున్నారు. ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ప్రయత్నంలోనే ఆమెకు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. ఈ రెండు ఎన్నికల్లో సత్తా చాటి తన హవాను పెంచుకోవాలని షర్మిల భావించారు.
ఇది తప్పు కాదు. ఏ రాజకీయ నాయకుడైనా తన సత్తా చాటి పైకి రావాలని, ఆధిపత్యం చలాయించాలని, పదవులు అనుభవించాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే షర్మిల కూడా తనవంతు ప్రయత్నం చేసిం ది. అయితే చిత్రంగా తాజా ఎన్నికల్లో ఆమె ఆశించింది ఒకటైతే జరిగింది మరొకటి కావడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయినప్పటికీ షర్మిల చేస్తున్న ప్రయత్నాలను గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన మాటే వేదంగా తను చెప్పిందే శాసనంగా నడిచేలాగా ఆమె వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న చర్చల్లో ఇదే విషయం బహిర్గతమైంది. తను సూచించిన ఒక కీలక నాయకుడికి పలానా పదవిని ఇవ్వాలని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఆయనకే ఎందుకు ఇవ్వాలి అన్న ప్రశ్నకు ఆమె తనదైన శైలిలో సమాధానం చెప్పినట్టు తెలిసింది. ఆయన పార్టీకి అవసరమని పార్టీలో ఆయనకు చాలా ప్రాధాన్యం ఉందని ఆమె చెప్పుకురావడం, సదరు నాయకుడిని వెనకేసుకు రావడం చూస్తే షర్మిల ఏ స్థాయిలో పట్టు బిగించాలని చూస్తున్నారనేది అర్థమవుతుంది. ఇక గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనైనా ఇన్చార్జిని నియమించాలన్నా లేక కమిటీలను వేయాలన్న ఒకటికి పది మందితో చర్చించి వారి ద్వారా కూడా జాబితాలు తయారు చేయించుకుని చివరకు పదవులు ఇచ్చే సంస్కృతి ఉంది.
కానీ ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే షర్మిల చెప్పిందే వేదంగా మారుతోంది. షర్మిల మినహా ఇప్పటివరకు ఎవరు కూడా మాకు ఈ పదవి కావాలని, లేదు వీరు ఈ పదవి అడుగుతున్నారని గానీ కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పింది లేదు. కాబట్టి షర్మిల మునుముందు ఒక నిశ్శబ్ద విప్లవం రూపంలో కాంగ్రెస్ పార్టీలో అధికారం చెలాయించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on August 14, 2024 3:43 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…