Political News

దువ్వాడ-మాధురి పరిచయం ‘గడప గడప’లోనట

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశం అంటే.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు మాధురి అనే నడి వయస్సు మహిళతో బంధం గురించే. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లను వదిలేసి ఆయన కొన్నేళ్ల కిందట పరిచయం అయిన మాధురితో ఉంటున్నారు. దీనిపై ఆయన భార్యాపిల్లలు గొడవ చేస్తున్నారు.

వాళ్ల మీద శ్రీనివాస్ దాడికి కూడా ప్రయత్నించారు. కట్ చేస్తే అసలు కొన్నేళ్ల ముందు వరకు భార్యా పిల్లలతో ఎంతో అన్యోన్యంగా ఉన్న శ్రీనివాస్ ఇప్పుడిలా ఎందుకు తయారయ్యాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మాధురికి పెళ్లయింది. ఆమె విడాకులు కూడా తీసుకోలేదు. మరి వీరి మధ్య బంధం ఎలా మొదలైంది అన్నది ఆసక్తికరం. దీనికి ఓ టీవీ ఛానెల్ చర్చలో సమాధానం దొరికింది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస్, మాధురిల పరిచయం జరిగిందట. అప్పట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి జనాలను పలకరిస్తూ.. వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని వాకబు చేయడం, ప్రభుత్వం గురించి సానుకూల అభిప్రాయం ఏర్పడేలా చేయడం తెలిసిందే.

ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు.. వాళ్లు ఏం చేస్తున్నారు అన్నది కనుక్కొన్నారు. ఆ క్రమంలోనే శ్రీనివాస్.. మాధురి ఇంటికి వెళ్లినపుడు తన భర్త యుఎస్‌లో ఉంటున్నారని, ఆమె ఒంటరిగా ఉన్నట్లు తెలిసిందట. స్వయంగా మాధురినే తనకు, శ్రీనివాస్‌కు గడప గడపకు కార్యక్రమంలో పరిచయం జరిగిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.

అలా మొదలైన పరిచయంతో.. శ్రీనివాస్ తన భార్యా పిల్లల్ని వదిలేసి ఆమెతో సెటిలవ్వడమే కాదు.. వైసీపీలో ఓ పదవి ఇప్పించి ఐప్యాక్ టీంను నడిపించే వరకు తీసుకెళ్లింది. ఈ విషయం తెలిసి వైసీపీ వాళ్లు గడప గడపకు కార్యక్రమాన్ని ఇలా ఉపయోగించుకున్నారా, విజయవంతం చేశారా అని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.

This post was last modified on August 13, 2024 9:45 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

2 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

3 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

3 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

4 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

4 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

5 hours ago