దిగ్గజ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండుల్కర్ క్రికెట్ కెరీరే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఆసక్తికరమైంది. అతను తన కంటే వయసులో ఐదేళ్లు పెద్ద అయిన అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అంజలిది ఆంగ్లో ఇండియన్ కుటుంబం కావడం విశేషం.
తన తల్లి అనాబెల్ బ్రిటిష్ వ్యక్తి. ఆనంద్ మెహతా అనే వ్యాపారవేత్తను పెళ్లాడి ముంబయిలో సెటిలయ్యారు. ఓ సందర్భంలో ఆమె తనయురాలు అంజలిని చూడగానే ప్రేమలో పడిపోయిన సచిన్.. టీనేజీలోనే ఆమె ఇంట్లో పెళ్లి ప్రపోజల్ పెట్టేశాడు.
సచిన్‌కు 21 ఏళ్ల వయసు వచ్చాక వీళ్లిద్దరిపెళ్లి జరిగింది. ఇప్పుడు వీరి కుటుంబం ఎంతో అన్యోన్యంగా సాగిపోతోంది. సచిన్, అంజలిల పిల్లలు యుక్త వయసుకు వచ్చారు. కాగా మంచి రచయిత్రి అయిన అనాబెల్.. తాను రాసిన ఓ పుస్తకంలో సచిన్ తమ అల్లుడు కావడం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
‘‘అంజలి ఓ కుర్రాడితో ప్రేమలో ఉందని తెలిసి అతడిని చూడాలనుకున్నా. నా సోదరుడు రిచర్డ్ ఇంట్లో కలిసేందుకు ఏర్పాటు చేశాం. వచ్చే కుర్రాడు ఆరడుగుల ఎత్తుతో, అందంగా ఉంటాడని ఊహించుకున్నా. కానీ వచ్చింది 19 ఏళ్ల సచిన్ టెండూల్కర్. దీంతో ఆశ్చర్యపోయా. అతడు పిల్లాడిలా కనిపించాడు. మృదు స్వభావి, తక్కువగా మాట్లాడుతూ సిగ్గు పడుతున్నాడు. సచిన్‌తో ఒంటరిగా మాట్లాడేందుకు.. అంజలి, రిచర్డ్‌ను వెళ్లిపొమ్మన్నా. నా భర్త ఆనంద్ మెహతాకు సచిన్ గురించి తెలుసు కాబట్టి ఆయన నుంచి అభ్యంతరం లేదు. సచిన్ అప్పటికే సూపర్ స్టార్. ఇలా పేరువచ్చిన చాలామంది తర్వాత దారి తప్పడంతో నా మనసులో భయాందోళన నెలకొంది. ఇంతలో అసలు సంగతి గుర్తొచ్చింది. ‘అంజలి గురించి నీ ఉద్దేశం ఏమిటి?’ అని సచిన్ కళ్లలోకి చూస్తూ ప్రశ్నించా. ‘‘మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం’’ అని చెప్పాడు.
దీంతో కొంత ఆశ్చర్యపోయా. 5.5 అడుగులకు కొంచెం ఎక్కువగా సచిన్ మా అమ్మాయి కంటే కాస్త ఎత్తు అంతే. బహుశా అతడి రింగుల జుట్టు అంగుళం ఎత్తు ఎక్కువ కనిపించేలా చేస్తుందేమో? అంజలి హీల్స్ వేసుకుంటే మాత్రం సచిన్ కంటే ఎత్తుగా కనిపించడం ఖాయం. ఇక తనను చూసిన మొదటిసారే ప్రేమలో పడినట్లు సచిన్ చెప్పాడని అంజలి తెలిపింది. వారిద్దరూ గాఢమైన ప్రేమలో ఉన్నారని నాకర్థమైంది. కూతురు సంతోషమే కోరుకున్నా. కానీ భారత్‌లో యువకులకు పెళ్లి వయసు 21. సచిన్‌కు అప్పటికి 19 ఏళ్లే.
అంజలి మెడిసిన్ పీజీ పూర్తి చేయాల్సి ఉంది. అందుకనే మరో రెండేళ్లు ఆగాలని.. అప్పటివరకు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని సచిన్‌ను కోరా. పెళ్లికి అంగీకారం తెలిపాక.. మా ఇంటికి సచిన్ దొంగచాటుగా వచ్చేవాడు. చాలా తక్కువమందే సచిన్‌ను గుర్తుపట్టేవాళ్లు. న్యూజిలాండ్ టూర్‌లో ఉన్న సచిన్ కాల్ చేయడంతో పెళ్లి గురించి అంజలి కాస్త గట్టిగా అడిగింది. దీంతో తన తల్లిదండ్రులతో మాట్లాడమని అతడు సూచించాడు. సచిన్ అన్నయ్య అజిత్ చొరవతో అంజలి వారి తల్లిదండ్రులను కలిసింది. మేము మాత్రం నిశ్చితార్థం ముందువరకు కలవలేదు. సమావేశమయ్యాక.. వారి కట్టుబాట్లు, మధ్య తరగతి, ప్రశాంత జీవితం చూసి మేం సంతోషించాం’’ అని అనాబెల్ తెలిపింది.
This post was last modified on August 13, 2024 9:26 am
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…
ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న…
https://youtu.be/zHiKFSBO_JE?si=HDSpx4GNEhcOje0y కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి…
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…
తండేల్ విడుదలకు ఇంకో 35 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోలేదు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్…